ఖతర్: సేల్స్‌మేన్‌గా చేరాడు.. కంపెనీనే కొనేశాడు

పొట్టకూటి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఓ భారతీయుడి విజయగాథ ఇది. స్వదేశాన్ని వీడలేక పరాయి దేశంలో బతకం ఇష్టం లేక అన్యమనస్కంగానే ఖతర్ బయలుదేరాడు మహమ్మద్ సాబిహ్ బుఖరి. ఆ తర్వాత ఆయన ఆ దేశంలోనే కుబేరుల జాబితాలో చేరిపోయారు.

ఓ కంపెనీలో సేల్స్ మేన్ ఉద్యోగంలో చేరిన బుఖరి అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి ఆ కంపెనీకే యజమాని అయ్యారు. ఇందులో తన సొంత గొప్పదనం ఏమీ లేదని, ఇదంతా విధి లిఖితమేనని అంటారు బుఖరి.

‘‘మన సంకల్పంతో దేన్నయినా కంట్రోల్ చేయవచ్చు. అయితే జీవితంలో ఎదురయ్యే సమస్యలు మన కంట్రోల్లో ఉండవు. వాటి పట్ల ఎలా స్పందిస్తామన్నది మాత్రం మన నియంత్రణలో ఉండాలి. ప్రతి ఓటమీ నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. అందుకే విజయానికి ఓటమి అన్నది వ్యతిరేకార్థం కాదు. నా దృష్టిలో ఓ ప్రయత్నాన్ని విరమించడమే ఓటమి’’ అని చెబుతున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

మా ఇతర కథనాలు