నేపాల్‌లో తల్లీ బిడ్డల ప్రాణాలు నిలబెడుతున్న సోలార్ సూట్ కేసులు
సౌరవిద్యుత్‌తో పనిచేసే సూట్‌కేస్‌లు నేపాల్‌లో చాలా మంది పసికందుల ప్రాణాలను కాపాడుతున్నాయి.
అక్కడ ఒకసారి కరెంట్ పోతే రెండువారాల వరకు వచ్చే దిక్కుకూడా ఉండదు. ఈ సమస్యతో ఇక్కడి ప్రసూతి కేంద్రాలు ఒకప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవి.
అయితే, ఇప్పుడా సమస్యకు పరిష్కారం దొరికింది.
ప్రసూతికేంద్రాలు ఇప్పుడు నిరంతరం విద్యుత్ వెలుగులతో నిండుతున్నాయి.
"చాలా సంతోషంగా ఉంది. విద్యుత్ కోతల వల్ల ఇబ్బందేమీ లేదు. ప్రసూతి కేంద్రాల్లో సోలార్ లైట్స్ ఉన్నాయి" అని చిరునవ్వుతో చెప్పింది నిండుగర్భిణిగా ఉన్న హరి సునర్.
ఆస్పత్రిలోని కాన్పుగదిలో ఉండే పసుపురంగు సూట్ కేసు నుంచి ఆ వెలుగులు వస్తున్నాయి.
ఇది సోలార్ సూట్‌కేస్.
నేపాల్‌లో తల్లులకు చీకటి గదే ప్రసూతి కేంద్రం
పైకప్పుకు అమర్చిన సౌర ఫలకాలతో అనుసంధానమై ఈ సూట్‌కేస్ పనిచేస్తుంది. ఇందులో ఉన్న చిన్నపాటి విద్యుత్ కేంద్రం నుంచే బల్బుకు, బ్యాటరీ చార్జింగ్కు కరెంటు సరఫరా అవుతుంది.
'సౌర' సంజీవిని
హిమ శిరీశ్లాంటి స్థానికంగా ఉండే మంత్రసానులకు ఇది ప్రాణాలు కాపాడే పరికరం.
ఆరోగ్యకేంద్రంలో కరెంట్ కోతల వల్లే వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు సోలార్ పవర్‌తో పరిష్కారం కనుక్కోవాలని ఆమె గట్టిగా నిర్ణయించుకున్నారు.
2014లో వన్ హర్ట్ వరల్డ్ వైడ్ అనే స్వచ్ఛంద సంస్థ పాండవఖనిలో ఈ సోలార్ సూట్‌కేస్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇక్కడ మాతాశిశుమరణాలు చోటుచేసుకోలేదు.
"చీకట్లో కాన్పంటే బిడ్డ ప్రాణం పోతుందని గర్భిణులు భయపడుతుంటారు. అయితే ఇప్పుడా వాళ్లకు ఆ భయం లేదు. సోలార్ లైట్లు వాళ్ల భయాలను తొలగించాయి" అని హిమ తెలిపారు.
ఇతర కథనాలు
ప్రాణాలను కాపాడే సోలార్ సూట్‌కేస్ స్విచ్‌ను ఆన్ చేస్తున్న మంత్రసాని హిమశిరీశ్
"చీకట్లో కాన్పంటే బిడ్డ ప్రాణం పోతుందని గర్భిణులు భయపడుతుంటారు. అయితే ఇప్పుడా వాళ్లకు ఆ భయం లేదు. సోలార్ లైట్లు వాళ్ల భయాలను తొలగించాయి" అని హిమ తెలిపారు.
'సౌర' పరిష్కారం
వీ కేర్ సోలార్కు చెందిన గైనకాలజిస్టు డాక్టర్ లారా స్టాచెల్ ఈ సోలార్ సూట్‌కేస్‌ను రూపొందించారు.
2008లో నైజీరియాలో సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో గర్భిణులు పడిన ఇబ్బందులు, శిశుమరణాలను ఆమె చూశారు. దీంతో సోలార్ ఇంజినీర్‌గా పనిచేసే తన భర్త హల్ హర్న్సన్ సహకారంతో ఆమె ఈ సోలార్ సూట్ కేసును అభివృద్ధి చేశారు.
నమూనాగా తీసుకొచ్చిన ఈ సూట్‌కేస్ నైజీరియాలో విజయవంతమైంది. దీంతో
మాతాశిశుమరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న దేశాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
భూకంపాలతో సవాలు
2015లో వచ్చిన భూకంపాలతో నేపాల్‌లో చాలా ఆస్పత్రులు నేలమట్టం అయ్యాయి. మరికొన్ని ఆరోగ్యకేంద్రాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
కేవలం 16 కేజీలే ఉండే ఈ సోలార్ సూట్‌కేస్‌ను ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చు.
భూకంపం తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆరోగ్యకేంద్రాల్లో వీటిని ఉపయోగించి చాలా మందిని రక్షించారు.
అమెరికాలో హత్యకూ అదే, ఆత్మహత్యకూ అదే
కానీ, ప్రకృతి వైపరిత్యాలే కాకుండా విద్యుత్ కోతలు లేకుండా ఉండాలంటే నేపాల్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంది.
'' గ్రామీణ ప్రాంతాల్లోని చాలా ప్రసూతికేంద్రాలు, ఆరోగ్యకేంద్రాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. మూడోవంతు గ్రామాల్లో విద్యుత్ కోతలు సర్వసాధారణం" అని సోలార్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ థాపా తెలిపారు.
పాండవఖనిలో ప్రసూతికేంద్రం ఏర్పాటు చేయడానికంటే ముందు ఇంటివద్దే కాన్పులు జరిగేవి. కొన్నిసార్లు చీకట్లోనే టార్చిలైట్ వెలుగులో ప్రసవాలు అయ్యేవి.
"ఒక్కోసారి బిడ్డ కడుపులో అడ్డం తిరుగుతుంది. అప్పుడు సహాయం చేసే పరికరాలు కూడా మా వద్ద ఉండవు" అని హిమ నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. కొన్నిసార్లు గర్భిణులు తీవ్రరక్తస్రావంతో చనిపోయేవారు అని పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, We Care Solar
భూకంప ప్రాంతాల్లోనూ తరలించేందుకు వీలుగా కేవలం 16 కేజీలతో ఈ సోలార్ సూట్‌కేస్‌ను రూపొందించారు.
ఇప్పుడు హిమ, ఆమె బృందం సోలార్ సూట్‌కేస్‌ను ఫోన్ చార్జింగ్ చేయడానికి కూడా ఉపయోగించుకుంటోంది.
" ఒక్కోసారి కరెంట్ పోతే 15 రోజుల వరకు రాదు. అప్పుడు మా ఫోన్లు కూడా పనిచేయవు.
బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధం కోల్పోతాం" అని ఆమె చెప్పారు.
ఇప్పుడు సునర్ రెండో కాన్పుకోసం ఇక్కడికొచ్చారు. మొదటి కాన్పు సమయంలో ఆమెకు ఎలాంటి అనుభవం ఎదురైందో చెప్పుకొచ్చారు.
"ఆ సమయంలో ఇక్కడికొచ్చినప్పుడు కరెంటు పోయింది. అయితే ఇక్కడున్నవాళ్లు సోలార్ లైట్ ఉందని చెప్పారు. దీంతో నేనేం ఆందోళన చెందలేదు" అని ఆమె చెప్పారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)