మరోసారి జపాన్ ప్రధానిగా ఎన్నికైన షింజో అబే

షింజో అబే

ఫొటో సోర్స్, Getty Images

జపాన్ దిగువ సభ మరోసారి షింజో అబేని ప్రధానిగా ఎన్నుకుంది. గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. వీటిలో షింజోకి చెందిన లిబరల్ డెమొక్రటిక్ పార్టీ మూడింట రెండొంతుల మెజార్టీని నిలబెట్టుకుంది.

కొమీటో పార్టీతో కలిసి అక్టోబర్ 22న జరిగిన ఎన్నికల బరిలోకి దిగిన షింజో, దక్షిణ కొరియాపైన ఉక్కు పాదం మోపడమే తన ప్రధాన ఎజెండాగా ఎన్నికల ప్రచారం చేశారు. దీని కోసం ప్రస్తుతం ఆత్మరక్షణకే పరిమితమైన జపాన్ రాజ్యాంగానికి షింజో ప్రభుత్వం సవరణలను చేపట్టే అవకాశం ఉందని స్థానిక మీడియా చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

2012లో తొలిసారి ప్రధాని పదవిని చేపట్టిన షింజో, 63ఏళ్ల వయసులో మరోసారి ఆ పదవిని దక్కించుకున్నారు. ఈ దఫా పూర్తి స్థాయిలో పదవిలో కొనసాగితే జపాన్‌కి ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా షింజో అబే చరిత్ర స‌ృష్టించే అవకాశం ఉంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)