పజిల్ 8: 'సీక్రెట్ కోడ్' కనిపెట్టగలరా?

పజిల్ 8

ఫొటో సోర్స్, Getty Images

పజిల్ 8 : సీక్రెట్ కోడ్ కనిపెట్టగలరా?

మీరు శత్రు దేశానికి చెందిన ఒక క్షిపణి ప్రయోగ కేంద్రం వద్ద ఉన్నారు.

ఎవరైనా సరే సీక్రెట్ కోడ్ చెబితేనే భద్రతా సిబ్బంది లోపలికి పంపిస్తారు.

అందుకే ఆ సీక్రెట్ కోడ్ తెలుసుకునేందుకు మీరు గేటు వద్దే దాక్కుని ఉన్నారు.

ఇంతలో ఒక సైంటిస్ట్ గేటు వద్దకు వచ్చాడు.

  • సెక్యూరిటీ గార్డు "టువెల్వ్" అని అడిగాడు.
  • దానికి సైంటిస్ట్ "సిక్స్" అని సమాధానం ఇచ్చాడు.

సెక్యూరిటీ గార్డు ఆ సైంటిస్టును లోపలికి పంపించాడు.

కాసేపటి తర్వాత మరో శాస్త్రవేత్త అక్కడికొచ్చాడు.

  • ఈసారి సెక్యూరిటీ గార్డు "సిక్స్" అని అడిగాడు.
  • దానికి సైంటిస్ట్‌ "త్రీ" అని సమాధానం ఇచ్చాడు.

దాంతో అతన్ని కూడా లోపలికి పంపించారు.

సీక్రెట్ కోడ్ తెలిసిపోయిందని మీరు భావించారు.

  • వెంటనే గేటు వద్దకు వెళ్లారు. అక్కడ సెక్యూరిటీ గార్డు 'నైన్‌' అని ప్రశ్నించాడు.
  • మీరు '‘ఫోర్ అండ్ హాఫ్’' అని సమాధానం చెప్పగానే సెక్యూరిటీ గార్డు అలారమ్ మోగించాడు.

మీరు చెప్పిన సీక్రెట్ కోడ్ తప్పా? మరి కరెక్ట్ కోడ్ ఏంటి? మీరు ఎక్కడ పొరపాటు చేశారు?

పజిల్ కష్టంగా ఉందా? అయితే సమాధానం కోసం కింద చూడండి.

వీడియో క్యాప్షన్,

ఈ పజిల్‌ను పరిష్కరించండి

జవాబు:

మీరు 'ఫోర్' అని చెబితే సరైన సమాధానం అయి ఉండేది. ఎందుకంటే 'నైన్' పదంలో 'నాలుగు'అక్షరాలు ఉన్నాయి.

"టువెల్వ్"లో ఆరు అక్షరాలు, "సిక్స్"లో మూడు అక్షరాలు ఉన్నాయి.

ఈ పజిల్‌ను లారెన్ చైల్డ్ రూపొందించారు. 'కోడ్ బ్రేకింగ్ చైల్డ్ జీనియస్ రూబీ రెడ్‌ఫోర్ట్' అనే తన నవలలో దీన్ని ఉపయోగించారు.

వి కూడా ప్రయత్నించండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)