సైకో లక్షణాలు ఉన్న వారు మంచి నాయకులా?

ఫొటో సోర్స్, Showtime Networks
ఇప్పుడు మీరు ఆఫీసులో ఉన్నారా?
అయితే ఓసారి మీ చుట్టుపక్కల ఎవరైనా సైకోపాత్ ఉన్నారేమో చూడండి?
ఎందుకంటే కార్పొరేట్ ప్రపంచంలోని కొందరు వ్యక్తులకు సాధారణంగానే సైకో లక్షణాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రతి అయిదుగురు కంపెనీ బోర్డు డైరెక్టర్లు, సీనియర్ మేనేజర్లలో ఒకరు తమలోని సైకో లక్షణాలను దాచిపెట్టి ఇతరులను ఆకర్షించేలా ప్రవర్తిస్తున్నట్లు పరిశోధనలు వివరిస్తున్నాయి.
అమెరికాలోని బిజినెస్ లీడర్లలో 4 శాతం మందికి సైకో లక్షణాలు ఉండొచ్చని న్యూయార్క్‌కు చెందిన మానసిక వైద్యుడు పాల్ బబాయిక్ తన పరిశోధనలో వెల్లడించారు.
"ఒక ఉద్యోగానికి సరైన నైపుణ్యాలు ఎంత అవసరమో, వ్యక్తిత్వం కూడా అంతే అవసరం. కొన్ని ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధించాలంటే సైకో లక్షణాలు అవసరమవుతాయి" అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మానసిక శాస్త్ర నిపుణులు డాక్టర్ కెవిన్ డట్టన్ అభిప్రాయపడ్డారు.
అయితే "సైకో లక్షణాలు ఉన్న వాళ్లు కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతారు, చేతలు ఉండవు" అని డెన్వర్ యూనివర్సిటీలో మానసిక శాస్త్ర ప్రొఫెసర్ లీయాన్నే టెన్ బ్రింక్ అన్నారు.
సైకో లీడర్లకు సాధారణంగా ఉండే లక్షణాలు
- భయం లేకపోవడం
- ముందువెనుకా ఆలోచించకుండా తోచింది చెయ్యడం
- పశ్చాత్తాపం లేకపోవడం
- తమ అవసరాల కోసం ఇతరులను వాడుకోవడం
- పరమ స్వార్థం
- కఠినంగా ఉండటం
అయితే ఈ లక్షణాల వల్ల కొంత మంచీ, కొంత చెడూ రెండూ ఉంటని డాక్టర్ కెవిన్ డట్టన్ అన్నారు. సందర్భానికి తగినట్లుగా వ్యక్తిత్వాన్ని మలుచుకోవాల్సి ఉంటుందని సూచించారు.
"కఠినంగా వ్యవహరించడం తప్పు కాదు. అయితే సందర్భం ముఖ్యం. భయపడకుండా ముందడుగు వేయడం మంచిదే కానీ అది ఒక్కోసారి నిర్లక్ష్యానికి దారితీయొచ్చు" అని తెలిపారు.
"ఆయా సందర్భాలకు తగినట్లుగా వ్యక్తిత్వాన్ని మలుచుకోవడమే అసలైన విజయ రహస్యం" అని డట్టన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చూడండి
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- అవునా.. ఐన్‌స్టీన్‌ది మొద్దు నిద్రా?
- మధుమేహులు రోజూ ఏం చేస్తారు?
- ‘బ్లూ వేల్’ బూచి నిజమేనా?
- పరాజయం చేసే మేలేంటో మీకు తెలుసా!
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- మీ పిల్లల కోపాన్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి?
- హ్యాపీయెస్ట్ కంట్రీస్‌లో సంతోషం అంతంతేనా?
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- టెక్స్టింగ్ సరే.. మరి sexting అంటే? అలా చేయొచ్చా?
- మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
- మానసిక రుగ్మత: పురుషులకు ఉంటే ఇలా వదిలేస్తారా?
- ఫిన్లండ్‌లో విఫలమైన కనీస ఆదాయ పథకం: ‘ఆనందంగానే ఉన్నాం.. కానీ ఉద్యోగం రాలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)