ఆగిన వాట్సాప్ : సోషల్ మీడియాలో జోకులే జోకులు

  • 3 నవంబర్ 2017
వాట్సాప్ లోగో

ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. కొద్ది గంటల పాటు తాత్కాలికంగా సేవలు నిలిచి పోయాయి. అయితే అందరికీ ఈ సమస్యలు తలెత్తినట్లు కనిపించడం లేదు. కొందరు మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల పోస్టులు చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది.

తన వాట్సాప్ పని చేయడం లేదంటూ తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు థమన్ ఎస్ ట్వీట్ చేశారు.

తమ వాట్సాప్ కూడా ఆగిపోయినట్లు ఆయన ఫాలోవర్లలో కొందరు కామెంట్ చేశారు. మరి కొందరు తమ వాట్సాప్ బాగానే పని చేస్తున్నట్లు తెలిపారు.

Image copyright TWITTER/THAMAN

బ్రిటన్, అమెరికా, చైనా, సౌదీ అరేబియా, శ్రీలంక, ఇండోనేసియా, కెన్యా వంటి దేశాల్లో కొన్ని చోట్ల వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగినట్లు బ్రిటన్‌కు చెందిన పత్రిక ది సన్ పేర్కొంది.

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ సేవలు నిలిచి పోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సాంకేతిక లోపమా లేక ఏదైనా సైబర్ దాడినా? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే ఈ పరిణామంపై వాట్సాప్ స్పందించలేదు.

ఇది ఇలా ఉంటే వాట్సాప్ నిలిచి పోవడంపై సోషల్ మీడియా వేదికగా ఛలోక్తులు చెలరేగాయి.

"దాదాపు 600 మంది అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్‌లతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే వాట్సాప్‌లో తాము పంపిన సందేశాలను చూసి కూడా సమాధానం ఇవ్వనందుకు" అని నైనా టెక్‌గై అనే ఖాతా హ్యాండిల్ కామెంట్ చేసింది.

Image copyright TWITTER

"పోల్: వాట్సాప్ ఆగిపోయాకా మీ బంధం ఎలా ఉంది?

1.సింగిల్2.డైవర్స్3.ఇన్ రిలేషన్‌షిప్" అంటూ యువర్ ఛాయిస్ మ్యాటర్స్ అనే ఖాతా ట్వీట్ చేసింది.

Image copyright TWITTER

"ఒకవేళ కొద్ది రోజుల పాటు వాట్సాప్ పని చేయకపోతే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది" అని మహ్మద్ ఆసిఫ్ ఖాన్ అనే ఆయన ట్వీట్ చేశాడు.

"వాట్సాప్ ఆగిపోయింది. ప్రపంచం కూలిపోతున్నట్లుగా ఉంది. గట్టిగా పట్టుకోండి. ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. వీటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి " అంటూ రిపబ్లిక్ టీవీ అసోసియేట్ ఎడిటర్ ఆదిత్య రాజ్ కౌల్ ట్వీటారు.

Image copyright TWITTER

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్

ఏనుగులు వేరే వాటిని కాపాడ్డానికి తమ ప్రాణాలనే పణంగా పెడతాయా

ఉప్పల‌పాడు పునరావాస కేంద్రానికి విదేశీ పక్షులు వేల సంఖ్యలో ఎందుకు వస్తున్నాయి

సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్

టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి...

ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీ సేఫ్ కాదా? క్రిప్టో కరెన్సీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమా...

అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది...

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి తరువాత మరో కండక్టర్ ఆత్మహత్య