లెబనాన్: ప్రాణభయంతో ప్రధాని రాజీనామా

లెబనాన్ ప్రధాన మంత్రి అల్-హరిరి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

లెబనాన్ ప్రధాన మంత్రి అల్-హరిరి

లెబనాన్ ప్రధాన మంత్రి అల్-హరిరి అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు ప్రాణ భయం ఉందని వెల్లడించారు. ఇరాన్‌పై ఆరోపణలు గుప్పించారు.

హరిరి తండ్రి, లెబనాన్ మాజీ ప్రధాని రఫిక్ అల్-హరిరి 2005లో హత్యకు గురయ్యారు.

సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుంచి ఓ టెలివిజన్‌లో మాట్లాడిన ఆయన.. "దివంగత మాజీ ప్రధాని అల్-హరిరి హత్యకు ముందు ఎలాంటి వాతావరణం ఉందో, ప్రస్తుతం మనమూ అలాంటి వాతావరణంలోనే బతుకుతున్నాం. కోవర్టుల ద్వారా నన్ను టార్గెట్ చేసుకున్నారని గ్రహించాను" అని అన్నారు.

లెబనాన్‌తోపాటు, పలు దేశాల్లో భయాందోళనలు, విధ్వంసాలను పురికొల్పేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని హరిరి ఆరోపించారు. ఇరాన్ మద్దతు పలుకుతున్న షియా ఉద్యమ పార్టీ హెజ్బొల్లా పైనా హరిరి ఆరోపణలు చేశారు.

2016 నవంబర్‌లోనే లెబనాన్ ప్రధానిగా హరిరి బాధ్యతలు చేపట్టారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)