360 డిగ్రీల వీడియో: షార్క్ ప్రపంచంలోకి వెళ్లొద్దామా!

  • 15 నవంబర్ 2017
360డిగ్రీల వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సముద్ర గర్భంలో భారీ సొర చేపల నడుమ ఈదుతుంటే ఎలా ఉంటుంది? ఈ 360 వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఆ చేపల నడుమ ఈదుతున్న అనుభూతి మీకు కలుగుతుంది.

సాధారణంగా షార్క్ చేపలంటేనే చాలా మంది హడలెత్తిపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున షార్క్ చేపల దాడిలో ఆరుగురు మరణిస్తున్నారు. కానీ, ఏటా లక్షల షార్క్‌లను మనుషులు చంపుతున్నారు.

మరి అందరూ అనుకుంటున్నట్లుగా నిజంగానే షార్క్‌లు అంత ప్రమాదకరమా? సముద్రంలో వాటి మధ్య ఈదలేమా? అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం ఇది.

సుత్తి ఆకారంలో తల కలిగి ఉండే "హ్యామర్‌హెడ్ షార్క్"ల నడుమ ఈ వీడియోను చిత్రీకరించారు.

బీబీసీ ఎర్త్, అలూసియా ప్రొడక్షన్స్ అందిస్తున్న వీడియో ఇది.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు