ఇంగ్లండ్‌‌లో ఢీకొన్న హెలికాప్టర్, ఎయిర్ క్రాఫ్ట్

  • 18 నవంబర్ 2017
విమాన ప్రమాదం

ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్‌షైర్ ప్రాంతంలో ఎగురుతున్న హెలికాప్టర్, ఎయిర్‌క్రాఫ్ట్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఇద్దరు, ఎయిర్ క్రాఫ్ట్‌లో ఇద్దరు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5.36 గంటల ప్రాంతంలో జరిగింది. గగనతలంలో వేగంగా వెళ్తూ ఢీకొన్న ఎయిర్ క్రాఫ్ట్‌లు ఒక్కసారిగా తునాతునకలయ్యాయి.

"ప్రమాదం జరిగినప్పుడు భారీ పేలుడు శబ్ధం వినిపించింది. పొగ లేచింది. ఎయిర్ క్రాఫ్ట్‌లు ముక్కలుగా మారి కింద కూలాయి" అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Image copyright South Beds News Agency

అత్యంత బలంగా ఢీకొనడంతో రెండింటిలో ఉన్న పైలట్లు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ప్రమాదం దట్టమైన అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. జనావాసాలు ఉన్నచోట జరిగి ఉంటే, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది.

ఘటనపై సంయుక్త విచారణ చేపడుతున్నట్టు పోలీసు, ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ విభాగాలు తెలిపాయి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు