అసలు జీఈఎస్ (అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు) అంటే?

  • 22 నవంబర్ 2017
తన పిల్లలతో ఇవాంకా ట్రంప్ Image copyright Facebook/Ivanka Trump

ఇవాంకా ట్రంప్.. ప్రస్తుతం హైదరాబాద్ జపిస్తున్న మంత్రం. ఈ నెల 28-30 మధ్య జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ఆమె పాల్గొననున్నారు.

దీన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది.

ఈ నేపథ్యంలో అసలు జీఈఎస్ అంటే ఏమిటి? ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ సదస్సు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.

ప్రధాన లక్ష్యం

ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లను ఒక తాటిపైకి తీసుకు వచ్చే ఉద్దేశంతో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)ను ఏర్పాటు చేశారు.

ముఖ్య విధులు

  • ప్రభుత్వం, ప్రైవేటు రంగానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించడం
  • అంతర్జాతీయంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను పంచుకునేందుకు వేదిక ఏర్పాటు చేయడం
  • కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలు కల్పించడం
  • ప్రధానంగా యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థల (స్టార్టప్స్)ను ప్రోత్సహించడం
  • పెట్టుబడులు పొందేందుకు సహాయం చేయడం
  • ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం

ఇవి కూడా చూడండి

Image copyright GES-2017.org

ఎప్పుడు నిర్వహిస్తారు?

  • ఈ సదస్సును ప్రతి ఏడాదీ నిర్వహిస్తారు.
  • తొలి సదస్సు 2010లో అమెరికాలో జరిగింది.

ప్రయోజనాలు

  • వినూత్న ఆలోచనలతో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
  • ఇప్పటి వరకు ఎన్నో ఆలోచనలు ఇలా వ్యాపార సంస్థలుగా మారాయి.
  • ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదార్లను కలుసుకోవచ్చు.
  • వ్యాపారాన్ని సులభంగా నిర్వహించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేయవచ్చు.
  • యువత వ్యాపార నైపుణ్యాలను పెంచుకునే వీలు కలుగుతుంది.
Image copyright Facebook/Narendra Modi

జీఈఎస్-2017

వేదిక: హైదరాబాద్

ఎప్పుడు: అమెరికాతో కలిసి నీతి ఆయోగ్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ నెల 28 నుంచి 30 వరకు సదస్సు జరుగుతుంది. దక్షిణాసియాలో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

అంశం: "ఉమెన్ ఫస్ట్, ప్రాస్పర్టీ ఫర్ ఆల్ " అనే అంశంతో మహిశా పారిశ్రామికవేత్తలకు పెద్ద పీట వేయనున్నారు. అలాగే అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.

ప్రతినిధులు: ప్రపంచవ్యాప్తంగా 1500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్న ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

ఇవి కూడా చూడండి

Image copyright GES-2016.org

గత సమావేశాలు ఇలా..

తొలిసారి 2010లో నిర్వహించిన సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. ఆ తరువాత టర్కీ (2011), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (2012), మలేసియా (2013), మొరాకో (2014), కెన్యా (2015), అమెరికా (2016)లలో సదస్సులు జరిగాయి. ప్రస్తుతం 8వ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది.

(ఆధారం: గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌-2017, 2016 వెబ్‌సైట్స్‌)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం