బ్రిటన్ యువరాజుకి, హాలీవుడ్ నటికీ మధ్య ప్రేమ ఇలా పుట్టింది..

  • 29 నవంబర్ 2017
హ్యారీ, మెఘాన్ Image copyright Getty Images

బ్రిటన్ యువరాజు హ్యారీ, అమెరికన్ నటి మేఘన్ మార్కెల్‌ల ఎంగేజ్‌మెంట్ ఇటీవలే జరిగింది.

వచ్చే ఏడాది జరగనున్న వాళ్లిద్దరి పెళ్లి కోసం ఇంగ్లండ్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వాళ్లను చూసి ‘జోడీ అదిరింది’ అని కొందరూ, బ్రిటన్ యువరాజుకి అమెరికా అమ్మాయి ఎందుకు?’ అని ఇంకొందరూ అంటున్నారు.

ఈ నేపథ్యంలో వాళ్లిద్దరికీ సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు.

డిజైనర్ హ్యారీ

మేఘన్‌ చేతికి ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని యువరాజు హ్యారీనే స్వయంగా డిజైన్ చేశారు. ఉంగరం మధ్యలో ఉన్న వజ్రాన్ని బోత్స్‌వానా నుంచి తెప్పించారు.

హ్యారీ మేఘన్‌లు ఎక్కువ కాలం బోత్స్‌వానాలో గడిపారు. దానికి గుర్తుగా హ్యారీ ఆ దేశపు వజ్రాన్ని ఎంపిక చేశారు.

మూడు వజ్రాలున్న ఆ ఉంగరంలో మరో రెండు వజ్రాల్ని హ్యారీ.. తన తల్లి ప్రిన్సెస్ డయానా వజ్రాల కలెక్షన్‌ నుంచి తీసుకున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక హ్యారీ డిజైన్ చేసిన ఎంగేజ్‌మెంట్ రింగ్

బ్లైండ్ డేట్

హ్యారీ, మేఘన్‌లు కలుసుకోక ముందు ఇద్దరికీ.. ఒకరి గురించి మరొకరికి పెద్దగా తెలీదు.

అమెరికాలో మేఘన్‌ నటించిన సీరియల్స్‌నీ, సినిమాల్నీ హ్యారీ ఎప్పుడూ చూడలేదు. మేఘన్‌కి కూడా బ్రిటన్ రాజ కుటుంబం గురించి పెద్దగా అవగాహన లేదు.

కామన్ ఫ్రెండ్స్ ద్వారా పదహారు నెలల క్రితం ఇద్దరూ కలుసుకున్నారు. అలా బ్లైండ్ డేటింగ్ ద్వారానే ఒకరినొకరు తెలుసుకోవడం మొదలుపెట్టారు.

Image copyright Vanity Fair/ Conde Nast
చిత్రం శీర్షిక హ్యారీతో ప్రేమలో ఉన్నానని మేఘన్ గత సెప్టెంబర్‌లో తెలిపారు

నటనకు దూరం

పెళ్లి తరవాత మేఘన్‌ నటనకు దూరం కానున్నారు. ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి మరో జీవితానికి దూరమవుతున్నట్లు ఆమె చెప్పారు.

ఇద్దరికీ సేవా కార్యక్రమాలంటే ఇష్టం కాబట్టి పెళ్లి తరవాత వాటి పైనే ఎక్కువగా దృష్టిపెట్టాలన్నది మేఘన్‌ ఆలోచన.

Image copyright EPA
చిత్రం శీర్షిక ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ల పెళ్లి మేలో జరుగనుంది

చికెన్ వండుతూ..

కొన్నాళ్ల క్రితం ఓరోజు హ్యారీ, మేఘన్‌లు ఇంట్లో రోస్టెడ్ చికెన్ వండుకునే పనిలో పడ్డారు. ఆ సమయంలోనే హ్యారీ మోకాలిపై కూర్చొని మేఘన్‌కి ప్రపోజ్ చేశారు.

ఆ చర్యకు ఆశ్చర్యపోయిన మేఘన్‌ వెంటనే హ్యారీకి ఓకే చెప్పారు. అప్పుడే హ్యారీ ఆమె చేతికి ఎంగేజ్‌మెంట్ ఉంగరం తొడిగారు.

Image copyright World Vision
చిత్రం శీర్షిక ‘వరల్డ్ విజన్ కెనడా’ అనే సంస్థకు మేఘన్‌ గ్లోబల్ అంబాసిడర్‌గా ఉన్నారు

సేవ, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలపైన ఆసక్తి చూపించే మేఘన్‌ ఐక్యరాజ్య సమితి తరఫున కూడా ఆ విభాగాల్లో పనిచేశారు.

‘వరల్డ్ విజన్ కెనడా’ అనే సంస్థకు గ్లోబల్ అంబాసిడర్‌గానూ ఉన్నారు. ఆరేళ్ల క్రితం అమెరికాకు చెందిన ఓ నటుడిని పెళ్లి చేసుకున్న మేఘన్‌ తరవాత విడాకులు తీసుకున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionమేఘన్ మార్కెల్: బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెడుతున్న మానవహక్కుల ప్రచారకర్త

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు