ప్రపంచంలోనే మొట్టమొదటి సి.డి. ప్లేయర్ ఏదో మీకు తెలుసా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బీబీసీ లైబ్రరీ: ప్రపంచంలో మొట్టమొదటి సీడీ ప్లేయర్‌

  • 2 డిసెంబర్ 2017

మార్పు సహజం.. టెక్నాలజీ రంగంలో మార్పుది శరవేగం. నిన్నటి వస్తువు రేపటికి ఉండదు. రేడియో నుండి టేప్ రికార్డర్, అక్కడి నుండి సీడీ ప్లేయర్లు, అక్కడి నుండి మరో మార్పు..

ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులకు.. కనీసం ఒక ‘తరం’(జనరేషన్) ఆయుష్షు కూడా ఉండటం లేదు. అలాంటి ఎన్నో సాంకేతిక విప్లవాలలో కాంపాక్ట్ డిస్క్ ( సీడీ ), సీడీ ప్లేయర్ కూడా ఉన్నాయి. అప్పట్లో సీడీ ఓ అబ్బురం. గుండ్రంగా.. వెలుతుర్లో రెండు మూడు రంగుల్లో మెరుస్తూ.. ఓ వింత వస్తువుగా అందర్నీ ఆశ్చర్యపరిచింది.

సీడీ ప్లేయర్లు.. గతంలోని రికార్డింగ్ విధానం కంటే మరింత నాణ్యమైన ఆడియోను అందించాయి. అలాంటి సీడీ ప్లేయర్ గురించి బీబీసీ 1982 లో ఓ రిపోర్ట్ అందించింది. ఆ రిపోర్ట్‌లోని 35 ఏళ్ల క్రితం నాటి సీడీ ప్లేయర్‌ను చూద్దామా..

చిత్రం శీర్షిక సి.డి. ప్లేయర్ గురించి బీబీసీ 1982 లో ఓ రిపోర్ట్ అందించింది

ప్రపంచంలో మొట్టమొదటి సి.డి. ప్లేయర్‌ 'సోనీ సి.డి.పి - 101'ను జపాన్‌లో విడుదల చేశారు. నిగనిగలాడే ఈ గుండ్రటి డిస్క్‌లు ఆ కాలానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.

ఆడియో సిగ్నల్స్‌ను కేంద్రీకృత లేజర్ బీమ్ ద్వారా 'ధ్వని' గా అనువదించారు. మొదటి సి.డి.ప్లేయర్ ధర 750 డాలర్లు పలికింది.

అయితే.. 2000 సంవత్సరం ప్రారంభం నుండి వీటి స్థానంలో మరింత చిన్నవైన ఆడియో పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.

మరిన్ని కథనాల కోసం

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు