పాకిస్తాన్‌లో సాయుధ దాడి..9 మంది మృతి

  • 1 డిసెంబర్ 2017
ఫైల్ ఫోటో Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫైల్ ఫోటో

పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో అగ్రికల్చర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌పై సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందినట్టు సమాచారం.

ఈ దాడితో పలువురు గాయపడ్డారని స్థానిక పోలీసులు అంటున్నారు.

ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారని మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఈ దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తేలలేదు. ఏ సంస్థా ఇందుకు బాధ్యత తీసుకోలేదు.

ఈద్ సందర్భంగా ఈ ఇన్‌స్టిట్యూట్‌కు సెలవులు ప్రకటించారని చెబుతున్నారు.

అయితే పాకిస్తాన్ సైన్యం ప్రతిచర్యకు పాల్పడుతూ ఈ దాడికి పాల్పడ్డవారిని హతమార్చింది.

పాకిస్తాన్‌లోని పెషావర్ నగరం ఆఫ్గానిస్తాన్ సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ తీవ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.

తుపాకులతో సంస్థలోకి ప్రవేశించిన ముగ్గురు సాయుధులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

ఇందులో ఎనిమిది మంది విద్యార్థులు ఒక అధికారి చనిపోయారు.

సాయుధులు ముగ్గురినీ చంపేసినట్లు పాక్ పోలీసులు తెలిపారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)