రష్యా జోక్యం విషయంలో అబద్ధమాడింది నిజమే: మైఖేల్ ఫ్లిన్

  • 2 డిసెంబర్ 2017
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్‌తో కలిసి ఉన్న ఫ్లిన్ Image copyright Getty Images

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న వ్యవహారంపై ఎఫ్‌బీఐ విచారణలో తాను అబద్ధాలు చెప్పినట్టు అమెరికా మాజీ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ అంగీకరించారు.

2016 నవంబర్‌‌లో జరిగిన ఎన్నికలకు కొన్ని వారాల ముందు తాను రష్యా దౌత్యాధికారిని కలవడం గురించి ఎఫ్‌బీఐకి తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చానని ఫ్లిన్ ఒప్పుకున్నారు.

ఈ కేసుపై ప్రత్యేక అధికారి రాబర్ట్ ముల్లర్ విచారణ జరుపుతున్నారు. ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని ఫ్లిన్ వెల్లడించారు.

విచారణాధికారులకు ఫ్లిన్ ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ ట్రంప్ అధికార బృందంలోని ఓ సీనియర్ వ్యక్తిని ఇరకాటంలో పడేసేలా ఉన్నట్టు తెలిసింది.

కాగా, డొనాల్డ్ ట్రంప్‌ సలహాదారు, అల్లుడు జారెడ్ కుష్నర్ పేరు ఇప్పుడు చర్చలోకి వచ్చిందని అమెరికా మీడియా పేర్కొంది.

Image copyright William J Hennessy Jr
చిత్రం శీర్షిక కోర్టులో న్యాయమూర్తి ముందు తప్పును అంగీకరించిన ఫ్లిన్

కోర్టులో ఏం జరిగింది?

వాషింగ్టన్ డీసీని ఫెడరల్ కోర్టులో హాజరైన ఫ్లిన్, "కావాలనే తప్పుడు, కల్పితమైన, మోసపూరిత వివరాలు చెప్పిన మాట వాస్తవమే" అని ప్రకటించారు.

అతని నేరాంగీకారాన్ని స్వీకరించిన న్యాయమూర్తి, ఫ్లిన్‌కు శిక్ష విధించబోమని తెలిపినట్టు ఈ విచారణ సందర్భంగా కోర్టులో ఉన్న ఏఎఫ్‌పీ వార్తా సంస్థ ప్రతినిధి తెలిపారు.

తన కుటుంబం, దేశం ఆకాంక్షలకు అనుగుణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫ్లిన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన వైట్‌హౌజ్, "ఫ్లిన్ ప్రకటన అతని వ్యక్తిగతమే, దానితో ఎవరికీ ఇబ్బంది లేదు" అని పేర్కొంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను ఓడించేందుకు రష్యాతో కలిసి పావులు కదిపారన్న ఆరోపణలను ఫ్లిన్ ఎదుర్కొంటున్నారు.

ఈ ఆరోపణలతో ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభించడంతో తన పదవిని కూడా కోల్పోయారు.

Image copyright Reuters

శుక్రవారం ఫ్లిన్‌ను కోర్టు నుంచి ఎఫ్‌బీఐ ఏజెంట్లు తీసుకెళ్తున్న సందర్భంలోనూ నిరసనకారులు గుమికూడారు. "అతడు 'క్రిమినల్', 'జైల్లో పెట్టండి', ఎన్నికల సమయంలో హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ శిబిరానికి అనుకూలంగా పనిచేశాడు" అంటూ నినాదాలు చేశారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్‌, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...

కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య

ట్రంప్‌కు 70 లక్షల మంది స్వాగతం పలకడం సాధ్యమేనా...

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

విశాఖ ఏజెన్సీ: తమ ఊరికి సొంతంగా రోడ్డు నిర్మించుకున్న ఈ గిరిజనులు ఏమంటున్నారో వింటారా...

ఛత్తీస్‌గఢ్ గిరిజనులపై బంగ్లాదేశ్ శరణార్థులు నిజంగానే ఆధిపత్యం చలాయిస్తున్నారా?

200 ఏళ్ల నాటి ఈస్టిండియా కంపెనీ పెయింటింగ్స్‌.. భారత్‌కు నచ్చలేదు, బ్రిటన్‌ ఇబ్బంది పడింది ఎందుకు

‘నగ్నంగా గుంపులుగా నిలబెట్టి, ‘ఫింగర్ టెస్ట్’లు చేశారు’: ఫిట్‌నెస్ పరీక్షల నిర్వహణ తీరుపై మహిళా ఉద్యోగుల అభ్యంతరం