ఉత్తర కొరియా: క్షిపణి ప్రయోగాలను ప్రపంచానికి తెలిపే న్యూస్ రీడర్ రీ చున్
‘అన్ యో ఘా సె యో’
ఈమె ఓ ప్రెజంటర్.. ఓ న్యూస్ రీడర్.. 40 సంవత్సరాలుగా వార్తలు చదువుతూనే ఉన్నారు. వామ్మో.. 40 ఏళ్లుగా అంటే.. ఆమె వయసెంతుంటుంది? మీ లెక్క నిజమే.. ఈమె వయసు 70 సంవత్సరాలకు పైబడే ఉంది. ఉత్తర కొరియాలో ఈమె చాలా పాపులర్ న్యూస్ రీడర్. పేరు రీ చున్ హీ.
ఉత్తర కొరియా ఏ క్షిపణిని ప్రయోగించినా, ఏ రాకెట్‌ను ప్రయోగించినా ఆ వార్తను ఈమె చదవాల్సిందే! ఈమె చదివితే ఆ వార్తకే ప్రాముఖ్యత వస్తుందన్నంత స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్- ఉన్‌కు ఈమె వార్తలు చదివే తీరు చాలా ఇష్టం. కిమ్ జోంగ్ ఈమెకు పెద్ద అభిమాని కూడా.
ఈమె కొరియన్ సెంట్రల్ టీవీలో పనిచేసి రిటైర్ అయ్యారు. కానీ అమెరికా - ఉత్తర కొరియా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ వార్తలను చదువుతూ మళ్లీ కనిపించారు.
వార్తలు చదవడంలోనే కాదు.. వస్త్రధారణలో కూడా ఈమె ప్రత్యేకం. ఎప్పుడూ గులాబి రంగులోని సాంప్రదాయ దుస్తులనే రీ చున్ ధరిస్తారు. కానీ దేశాధినేతల మరణ వార్తలను చదవాల్సొచ్చినపుడు మాత్రం నల్ల రంగు బట్టలను ధరిస్తారు. 40 ఏళ్లలో ఈమె నవ్వారు.. అరిచారు.. ఏడ్చారు కూడా!
ఇంతకీ అన్ యో ఘా సె యో అంటే.. కొరియాలో గుడ్ ఈవెనింగ్ అని అర్థం.
మా ఇతర కథనాలు
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
- కొరియా: ఉత్తరం, దక్షిణం దగ్గరవుతున్నాయా?
- ఉత్తర కొరియా యుద్ధానికి దిగితే ఏం జరగొచ్చు?
- ఉత్తర కొరియా: అమెరికా మొత్తం మా క్షిపణి పరిధిలో ఉంది
- కొరియా తీరంలో అమెరికా ‘యుద్ధ’ విన్యాసం
- ట్రంప్: ఉత్తర కొరియాతో చర్చలు దండగ
- అది మీ తాత కలలు కన్న స్వర్గం కాదు: కిమ్‌కు ట్రంప్ వార్నింగ్
- ఉత్తరకొరియా: ఒకప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడెందుకు ఇలా తయారైంది?
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)