అంతరిక్షం నుంచి చూస్తే మెరుపులు ఇలా కనిపిస్తాయి!

అంతరిక్షం నుంచి చూస్తే మెరుపులు ఇలా కనిపిస్తాయి!

పిడుగు పడినప్పుడు వచ్చే 'మెరుపు అందం' చూసేందుకు గమ్మత్తుగా ఉంటుంది. ఆకాశంలో మెరుపుల్ని అంతరిక్షం నుంచి ఎప్పుడైనా చూశారా? అసలు అంతరిక్షం నుంచి చూస్తే పిడుగు పడినప్పుడు వచ్చే మెరుపులు ఎలా ఉంటాయి? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇదే ప్రయత్నం చేసింది.

ఉరుములు-మెరుపులను నాసా తన కెమేరాలో బంధించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చైనా, కొరియా, జపాన్‌ మీదుగా వెళ్తున్నప్పుడు ఈ వీడియోను చిత్రీకరించింది. జపాన్ సముద్రం మీదుగా ఉరుములు మెరుపులు, సమీప నగరంలోని విద్యుత్ దీపాలు కనిపించాయని తమకు వ్యోమగామి బ్రేస్నిక్ చెప్పారు.

మేఘాలలో ఏర్పడే భారీ మెరుపులు అంతరిక్షం నుంచి చూస్తే ఎలా కనిపిస్తాయో మీరూ చూడండి మరి!

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)