ప్రపంచంలో తొలి గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు 50 ఏళ్లు

ప్రపంచంలో తొలి గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు 50 ఏళ్లు

దక్షిణాఫ్రికాకు చెందిన డాక్టర్ క్రిస్టియాన్ బర్నార్డ్ ప్రపంచంలో తొలిసారిగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు.

1967 డిసెంబర్ 3వ తేదీన ఈ శస్త్రచికిత్స జరిగింది. రోడ్డు ప్రమాద బాధితుడైన 26 ఏళ్ల డెనీస్ డార్వాల్ గుండె.. 54 ఏళ్ల లూయిస్ వాష్కన్సి శరీరంలో హృదయ స్పందనలు ప్రారంభించింది.

గుండె మార్పిడి చేసుకున్న వాష్కన్సి ఆపరేషన్ తర్వాత 18 రోజులే జీవించారు. అయితే, ప్రస్తుతం ఈ విధానం వల్ల వేలాది మంది ప్రాణాలు నిలుస్తున్నాయి. గుండె మార్పిడి తర్వాత ఎక్కువ మంది ఐదేళ్ల వరకు జీవిస్తున్నారు.

ప్రస్తుతం.. హృద్రోగాలు, గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు ఎక్కువైన కారణంగా గుండెలకు డిమాండ్ పెరిగింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)