బీబీసీ లైబ్రరీ: సమాన పారితోషికం కోసం మహిళా టెన్నిస్ స్టార్ల ఉద్యమం

బీబీసీ లైబ్రరీ: సమాన పారితోషికం కోసం మహిళా టెన్నిస్ స్టార్ల ఉద్యమం

వీళ్లు నవతరం మహిళా ఉద్యమకారులు. ఒక ప్రెఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణుల బృందం. పురుషాధిపత్యమున్న టెన్నిస్ క్రీడలో మహిళలకు సమాన పారితోషికం ఇవ్వాలని వీరు పోరాడుతున్నారు.

ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్ అయిన బిల్లీ జీన్ కింగ్ వాళ్ల నాయకురాలు. దశాబ్దాలుగా టెన్నిస్‌లో మహిళలను పురుషులకన్నా తక్కువగా చూడడాన్ని ప్రశ్నించేందుకు వారు ఒక సంఘంగా మారారు.

''ఈ ఏడాది పురుషులకిస్తున్న ప్రైజ్ మనీలో మూడోవంతులో సగాన్ని మహిళలకిచ్చారు'' అని చెప్తున్నారు నాటి క్రీడాకారిణి ఒకరు.

''1970 కన్నా ముందు టోర్నమెంట్లలో ఆడే అవకాశం ఇవ్వండంటూ మహిళలు అభ్యర్థించాల్సి వచ్చేది. 150 నుంచి 400 డాలర్ల కోసం అధికారులను బతిమాలాడాల్సి వచ్చేది. బలమైన ఫోర్‌హ్యాండ్ లేకున్నా సరే.. అందంగా ఆకర్షణీయంగా ఉండేవాళ్లకు తొందరగా అవకాశం ఇచ్చేవారు'' అని ఆమె చెప్పారు.

టెన్నిస్ కోర్టులో సమానత్వం విషయంలో మహిళా క్రీడాకారుల తరఫున బిల్లీ జీన్ కింగ్ పోరాటం చాలా విశిష్టమైనది.

''ఏ మనిషి అయినా మంచి ఆట ఆడినపుడు దానికి తగిన పారితోషకం పొందటం కన్నా మేలైన విషయం మరొకటి ఉండదు'' అన్నారు బిల్లీ జీన్ కింగ్.

ఆమె లాంటి వారు మహిళా క్రీడ కోసం మహిళల కోసం నిలబడి పోరాడుతున్నారు. వారి కథ అగ్రస్థానంలో ఉన్న మహిళా క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉంది.

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)