కథలు చెప్పే తోలుబొమ్మలు

కథలు చెప్పే తోలుబొమ్మలు

తోలుబొమ్మలాట.. భారతదేశంలోని ఒక ప్రాచీన జానపద కళారూపం. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు బాగా ప్రసిద్ధి చెందినది.

మానవుడు నాటక దశలోకి ప్రవేశించే పరిణామక్రమంలో తోలుబొమ్మలాట ఎంతో క్రియాశీలక పాత్ర పోషించింది. పురాణాలు, కావ్యాల్లోని ఘట్టాలు, సాంఘిక కథలు ఈ కళారూపానికి ప్రధాన ఇతివృత్తాలు.

ప్రాణంలేని బొమ్మలకు జీవం పోసే అద్భుతమైన కళ ఇది. ఇటువంటి కళకు రానురాను ఆదరణ తగ్గిపోతోంది. దాదాపు అంతరించే దశకు చేరుకుంది. వీటిపై ఆధారపడిన వారి బతుకులు దుర్భరంగా ఉంటున్నాయి.

ఇటువంటి జానపద కళారూపాలను కాపాడుకునే ఉద్దేశంతో ఇటీవల దిల్లీలో 'స్టోరీ టెల్లింగ్' ఫెస్టివల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీసీ ప్రతినిధులు అందిస్తున్న ఈ వీడియో చూడండి.

రిపోర్టర్: పద్మ మీనాక్షి

షూట్ ఎడిటర్: అనిల్ కుమార్

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)