బాబ్రీ విధ్వంసం తర్వాత పాకిస్తాన్‌లో కూల్చిన మందిరాలివే!

  • 8 డిసెంబర్ 2017
లాహోర్‌లోని జైన్ మందిరం Image copyright Getty Images
చిత్రం శీర్షిక లాహోర్‌లోని జైన మందిరాన్ని డిసెంబర్ 8న కూల్చి వేశారు.

అయోధ్యలో అతివాద హిందూ గుంపులు బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన తరువాత దానిపై పాకిస్తాన్‌లో ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందనే విషయాన్ని చాలా తక్కువ మందే ఆలోచించి ఉంటారు.

పాకిస్తాన్‌ జనాభాలో హిందువులూ ఉన్నారు. అక్కడ వారు ప్రార్థనలు జరుపుకొనేందుకు కొన్ని మందిరాలు కూడా ఉన్నాయి.

అయితే, 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత పాకిస్తాన్‌లోనూ వెంటనే ప్రతీకార చర్యలు మొదలయ్యాయి.

బాబ్రీ విధ్వంసం తర్వాత దాదాపు 100 మందిరాలను నేలమట్టం చేశారు లేదా వాటికి భారీ నష్టం కలిగించారు.

అయితే వీటిలో చాలా వరకు నిత్యం పూజలు, పునస్కారాలు సాగే మందిరాలు కావు.

వీటిలో కొన్ని మందిరాలలో 1947లో జరిగిన దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌కు వచ్చిన వాళ్లు ఆశ్రయం తీసుకున్నారు.

మా ఇతర కథనాలు

Image copyright Shiraz Hassan/BBC
చిత్రం శీర్షిక ప్రస్తుతం జైన మందిర స్థానంలో దుమ్ము కొట్టుకుపోయిన శిథిలాలు కనిపిస్తున్నాయి.

జైన మందిరం

1992 డిసెంబర్ 8న లాహోర్‌లో ఉన్న ఒక జైన మందిరాన్ని కొందరు కూల్చివేశారు. ఇప్పుడు అక్కడ కేవలం దుమ్ము కొట్టుకుపోయిన శిథిలాలు మాత్రమే ఉన్నాయి.

నేను ఈ మందిరాల్లో ఉన్న కొంతమందితో మాట్లాడాను.

1992లో ఈ మందిరాలను గుంపులు కూల్చడానికి వచ్చినపుడు వీటిని వదిలెయ్యండని వేడుకున్నామని వారు తెలిపారు.

వారు నాటి ఘటనలను గుర్తు చేసుకుంటూ "ఇది మా నివాసం. మాపై దాడి చేయకండి.. అని వాళ్లను వేడుకున్నాం" అని చెప్పారు.

మా ఇతర కథనాలు

Image copyright Shiraz Hassan/BBC
చిత్రం శీర్షిక బాబ్రీ విధ్వంసం తర్వాత కృష్ణ మందిరం గోపురాన్ని కూల్చివేశారు.

కృష్ణ మందిరం

రావల్పిండిలో ఉన్న కృష్ణుడి మందిరంలో నేటికీ హిందువుల పూజలు జరుగుతాయి. బాబ్రీ విధ్వంసం తర్వాత ఈ మందిరం గోపురాన్ని కూల్చివేశారు.

ప్రభుత్వం తలచుకుంటే ఈ గోపురాన్ని మళ్లీ నిర్మించగలిగేది కానీ అలా జరగలేదు.

Image copyright Shiraz Hassan/BBC
చిత్రం శీర్షిక ప్రస్తుతం కల్యాణ్ దాస్ మందిరంలో అంధుల కోసం ఒక స్కూలు నడిపిస్తున్నారు.

కల్యాణ్ దాస్ మందిరం

ఈ ఫోటో రావల్పిండిలోని కల్యాణ్ దాస్ మందిరానిది. ప్రస్తుతం ఇందులో అంధుల కోసం ఒక స్కూలు నడిపిస్తున్నారు.

1992లో ఓ గుంపు దీనిపై దాడి చేశారనీ, అయితే ఎలాగోలా దాన్ని కాపాడుకోగలిగామనీ స్కూలు అధికారులు నాకు చెప్పారు.

Image copyright Shiraz Hassan/BBC
చిత్రం శీర్షిక ఝేలమ్‌లోని మందిరం

పాకిస్తాన్ లోని ఝేలమ్ పట్టణంలో ఖాళీగా పడి ఉన్న ఓ మందిరం దృశ్యం.

ఈ మందిరాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించిన వారందరికీ ఏదో ఒక నష్టం జరిగినట్టు స్థానికులు చెబుతారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులు గాయపడడమో, చనిపోవడమో జరిగిందని వారంటారు.

1992లో ఈ మందిరాన్ని కూడా దెబ్బతీయాలని కొందరు ప్రయత్నించారు. మందిరం పైభాగం కూలిపోయింది. ఆ తర్వాత మరెవ్వరూ దీనికి నష్టం చేయడానికి ప్రయత్నించలేదు.

Image copyright Shiraz Hassan/BBC
చిత్రం శీర్షిక బాబ్రీ మసీదు ధ్వంసం అనంతరం బంశీధర్ మందిరాన్ని పాక్షికంగా నష్టపరిచారు.

బంశీధర్ మందిరం

లాహోర్‌లోని అనార్కలీ బజారులో ఉన్న బంశీధర్ మందిరాన్ని కూడా 1992లో పాక్షికంగా నష్టపరిచారు.

Image copyright Shiraz Hassan/BBC
చిత్రం శీర్షిక లాహోర్‌లోని శీతలా దేవి మందిరం

శీతలా దేవి మందిరం

పై ఫొటో లాహోర్‌లోని శీతలా దేవి మందిరానిది. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత పాకిస్తాన్‌లో ఉన్మాదుల క్రోధానికి గురైన మందిరాల్లో ఇది కూడా ఒకటి.

వారి దాడిలో ఈ మందిరం పాక్షికంగా దెబ్బతింది. దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌కు వచ్చిన వారు కొందరు ఈ మధ్య కాలంలో ఈ మందిరంలో ఆశ్రయం పొందుతున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అవిశ్వాసం: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల రాజకీయ వ్యూహాలేంటి?

'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం

వీళ్లు ఐసిస్ మిలిటెంట్ల పిల్లలు.. ఏతప్పూ చేయకపోయినా శిక్ష అనుభవిస్తున్నారు

మోదీ సమక్షంలో జరిగిన ఎస్సార్ ఒప్పందం ఏంటి? ఇందులో కుంభకోణం ఉందా?

ఇంక్లవ్ డేటింగ్ యాప్: వీలైతే వికలాంగులతో నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ, అన్నీ కలిస్తే అంతకు మించి

రూటు మారుస్తున్న కిమ్: ఎడాపెడా తనిఖీలు, చెడామడా తిట్లు

‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?

అయోమయంలో అమెరికా.. రష్యా జోక్యంపై ట్రంప్‌దో మాట, ఇంటెలిజెన్స్‌ది ఇంకో మాట