పజిల్: ఆ పార్టీలో 3 భాషలు మాట్లాడేవారెందరు?

  • 10 డిసెంబర్ 2017
పార్టీ Image copyright Getty Images

పజిల్ 13

ఒక పార్టీకి 100 మంది హాజరయ్యారు. అందులో 90 మంది తెలుగు, 80 మంది ఇంగ్లిష్, 75 మంది హిందీ మాట్లాడుతారు.

ఈ పార్టీలో కనీసం 3 భాషలు మాట్లాడేవారు ఎంత మంది ఉంటారు?

సమాధానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమాధానం

45

10 మంది తెలుగు మాట్లాడలేరు. 20 మంది ఇంగ్లిష్ మాట్లాడలేరు. అలాగే, 25 మంది హిందీ మాట్లాడలేరు. అంటే రెండు భాషలు మాట్లాడే అత్యధికుల సంఖ్య 25 అని చెప్పొచ్చు.

అయితే, ఇక్కడ అడిగిన సమస్య ఎంత మంది కనీసం మూడు భాషలు మాట్లాడగలరని..

అప్పుడు ఈ సమస్యను పరిష్కరించాలంటే ఈ 10, 20, 25 మందిని వేరే వ్యక్తులుగా ఊహించుకోవాలి.

అప్పుడు 55 మంది ఏదో ఒక్క భాషను మాట్లాడలేరని గుర్తించవచ్చు. ఇక మిగిలిన 45 మంది మూడు భాషలు మాట్లాడగలరని చెప్పొచ్చు.

ఈ పజిల్‌ను sharpbrains.com సంస్థ అందించింది.

ఇతర పజిల్స్

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు