లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల్ని బయటపెట్టిన ‘పాఠశాల బాలిక’
ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ యాప్‌లను వాడే చిన్నారులకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. వాళ్లను అపరిచితులు లైంగికంగా వేధిస్తున్నారు. అసభ్య సందేశాలు పంపుతున్నారు. బీబీసీ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఇంటర్నెట్ భద్రత ఉద్యమకారిణి క్యూజియా షా 14 ఏళ్ల విద్యార్థినిగా నటిస్తూ కొన్ని ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్‌లలో చాట్ చేశారు. చిన్నారులకు అవి ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చూపెట్టారు.
మొదట ఆమె ట్విటర్‌కు చెందిన పెరిస్కోప్ యాప్‌లో 14 ఏళ్ల విద్యార్థినిగా లాగిన్ అయ్యారు.
కానీ, అది తెరిచిన కొన్ని క్షణాల్లోనే అపరిచిత వ్యక్తులు ఆమెను దుస్తులు తీసేయమని కామెంట్లు చేశారు.
దీనిపై షా మాట్లాడుతూ.. 'మొదట నేను అయోమయానికి గురయ్యాను. తర్వాత వారి దృష్టిని ఆకర్షించినందుకు మనసులోనే ఆనందించాను.కానీ, వారి కామెంట్లు చూసేసరికి కంగారు పడ్డాను' అని చెప్పారు.
మరో వెబ్ సైట్ లైవ్.మీ నుంచి ఆమెకు వరుసగా అసభ్యకర సందేశాలు వచ్చిపడ్డాయి.
'ఐ థింక్ యూ ఆర్ హాట్', ' యూ ఆర్ క్యూట్' ! నేను మగాడ్ని. నువ్వు చూడాలనుకుంటున్నావా?’ అని లైంగిక చేష్టలకు దిగనవారున్నారు.
లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ల్లో చిన్నారుల భద్రతను పరీక్షించేందుకు ఇంటర్నెట్ భద్రత ఉద్యమకారిణి క్యూజియా షా పాఠశాల బాలికలా లాగిన్ అయ్యారు
ఇక, అపరిచితులతో వెబ్‌కామ్‌లో చాట్ చేయడానికి అనుమతించే 'ఒమెగల్' సైట్లోనూ అదే పరిస్థితి ఎదురైంది.
ఈ సైట్‌కు సంబంధించిన 18 ఏళ్ల లోపు విభాగంలో క్యూజియా లాగిన్ అయ్యారు.
తన వయసు 14 ఏళ్లు అని చెప్పినప్పటికీ, చాలా మంది మగాళ్లు ఆమెకు అసభ్య సందేశాలు పంపారు.
'నా నేపథ్యం చెప్పినా కూడా అసభ్య చేష్టలతో చాట్ చేయడం దారుణం. అశ్లీలత పెద్దవాళ్ల విషయంలో తగినదే కావొచ్చు. కానీ, పిల్లల విషయంలో అలా ఆలోచించనేలేం' అని క్యూజియా బీబీసీతో చెప్పారు.
ఈ విషయంపై ఒమెగల్, లైవ్.మీ వెబ్సైట్లను ఇంటర్వ్యూ కోసం బీబీసీ ఈ-మెయిల్లో సంప్రదించగా వారు సమాధానం ఇవ్వలేదు.
ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని పెరిస్కోప్ పేర్కొంది. చిన్నారులపై లైంగిక వేధింపులను తాము ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించమని వివరణ ఇచ్చింది.
మా ఇతర కథనాలు
- వేధించారంటే ఉద్యోగాల్లోంచి ఊస్టే!
- అబ్బాయిలు ‘ఆ’ చిత్రాలను నెట్లో పెట్టలేరు!
- లైంగిక వేధింపులు: చట్ట ప్రకారం ఫిర్యాదు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా?
- షాకిస్తున్న రహస్య కెమెరా నీలిచిత్రాలు
- అనుపమా పరమేశ్వరన్ : కాలేజీ రోజుల్లో నన్నూ వేధించారు
- ‘టాలీవుడ్లో హీరోయిన్లకు వేధింపులు ఇలా ఉంటాయ్!‘
- చైనా యువతుల లైవ్ స్ట్రీమింగ్
- న్యూడ్ ఫొటోల వెనుక ఆంతర్యమేంటి?
- భర్తను హత్య చేసిన భార్య: ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి.. భర్తగా చూపించాలనుకుంది. కానీ, ఆధార్ పట్టించింది
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)