గుజరాత్: ‘సబర్మతి’ వృద్ధ నిర్వాసితుల దుస్థితి

గుజరాత్: ‘సబర్మతి’ వృద్ధ నిర్వాసితుల దుస్థితి

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో సబర్మతి నది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ నది అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ మురికివాడల్లో నివసించే వారిని ప్రభుత్వ వసతులకు తరలించారు. కానీ చాలా మంది వృద్ధులకు మూడు, నాలుగు అంతస్తుల్లోని ఫ్లాట్లు కేటాయించారు.

కానీ వయసుతో వచ్చే శారీరక సమస్యల కారణంగా వారు పై అంతస్తులకు వెళ్లి తమకు కేటాయించిన ఇళ్లలో నివసించలేకపోతున్నారు. అందువల్ల వారు కిందనే రోడ్డుపక్కన, మెట్ల కింద దుర్భర పరిస్థితుల్లో జీవించాల్సి వస్తోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)