ఇలాగైతే పురిటి గదుల్లో జననాలే..! మరణాలుండవ్!

ఇలాగైతే పురిటి గదుల్లో జననాలే..! మరణాలుండవ్!

పాకిస్తాన్‌లో మహిళా డాక్టర్లు వైద్య వృత్తిలో కొనసాగడం కద్దు. బయటి ప్రపంచంలో పనిచేయాలంటే వారికి కుటుంబ అంగీకారం కావాలి. చాలా మంది మహిళా డాక్టర్లు తమ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మరోవైపు.. పాకిస్తాన్‌లో ప్రతి 20 నిమిషాలకు ఒక మహిళ మరణిస్తోంది. గర్భం దాల్చాక, ప్రసవ సమయాల్లో తలెత్తే సమస్యల వీరి మరణాలకు కారణం. ఈ సమయంలోనే ఇద్దరు మహిళా డాక్టర్లు ఓ వినూత్న ఆలోచన చేశారు.

ప్రసవ సమయంలో ఓ మంత్రసాని లేక ఓ డాక్టర్ అందుబాటులో ఉంటే దాదాపు 99% ప్రసూతి మరణాలను నివారించవచ్చు..

ఆ వెంటనే తమ ఆలోచనను ఆచరణలో పెట్టారు యువ డాక్టర్లు సారా సయీద్, ఇఫత్ జాఫర్‌.

స్థానికంగా ఉన్న మంత్రసానులకు మెరుగైన శిక్షణ ఇచ్చి, వారిని కొందరు మహిళా డాక్టర్లతో అనుసంధానం చేస్తారు. మహిళా డాక్టర్లు ఆన్‌లైన్ వీడియో ద్వారా గర్భవతులను పరీక్షిస్తుంటారు.

మరోవైపు మంత్రసానులకూ సూచనలు చేస్తుంటారు.

ఇప్పటిదాకా వీరు 28వేల మందిని ఆన్‌లైన్ ద్వారా పరీక్షించారు. లక్షా నలభై వేల మందికి సహాయం చేశారు.

ఇలా అయితే అక్కడేమిటి.. ఎక్కడైనా తల్లీ బిడ్డా క్షేమంగానే ఉంటారు. ఇకపై పురిటి గదుల్లో జననాలే తప్ప.. మరణాలు ఉండవు!

బీబీసీ ఇన్నొవేటర్ సిరీస్‌ ఈ ఆసక్తికర కథనాన్ని అందిస్తోంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)