ఇరాక్: మూకుమ్మడిగా 38 మంది ఐఎస్ తీవ్రవాదులకు ఉరిశిక్ష

  • 15 డిసెంబర్ 2017
గోతి Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2016లో 88 మందిని ఇరాక్ ఉరితీసింది.

హింసాత్మక దాడులకు పాల్పడిన కేసుల్లో దోషులుగా తేలిన 38 మంది జిహాదీ మిలిటెంట్లను మూకుమ్మడిగా ఉరి తీసినట్లు ఇరాక్ ప్రకటించింది.

ఈ శిక్ష పడిన వారంతా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సభ్యులేనని ఇరాక్ న్యాయ శాఖ పేర్కొంది.

దక్షిణ ఇరాక్‌లోని నసిరియా పట్టణంలో ఉన్న జైలులో, దేశ న్యాయ శాఖ మంత్రి సమక్షంలోనే ఈ శిక్షలు అమలు చేసినట్టు అధికారులు తెలిపారు.

అయితే, ఈ చర్యపై పలు అంతర్జాతీయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి.

ఇరాక్‌లో ఇలా మూకుమ్మడిగా ఉరి తీయడం ఇదేమీ తొలిసారి కాదు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 25న 42 మందికి, 2016లో 88 మందికి, 2015లో 26 మందికి ఇలా మరణ శిక్షలు అమలు చేశారు.

స్పందించిన ఆమ్నెస్టీ

ఇది ఐఎస్‌పై విజయం సాధించామని చెప్పుకుంటూ ఇరాక్ పాల్పడిన 'నిరంకుశ' చర్య అని మానవహక్కుల కోసం పోరాడే స్వచ్ఛంద సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది.

ఐఎస్ ఆధీనంలోని ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్యులకు, నేరాలకు పాల్పడుతున్న వారికి మధ్య 'తేడాను గుర్తించడంలో న్యాయ వ్యవస్థ విఫలమైందని' ఇటీవల హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)