బంగ్లాదేశ్ విక్టరీ డే: మారణ హోమానికి గుర్తుగా ఓ మ్యూజియం

బంగ్లాదేశ్ విక్టరీ డే: మారణ హోమానికి గుర్తుగా ఓ మ్యూజియం

వీడియో ప్రొడ్యూసర్: సలీం మియా

డిసెంబర్ 16ని బంగ్లాదేశ్ 'విక్టరీ డే'గా జరుపుకుంటుంది. 1971 నాటి యుద్ధంలో పాకిస్తాన్ బలగాలపై విజయం సాధించినందుకు జరుపుకునే వేడుకలవి. కానీ ఆ గెలుపు వెనక భారీ మారణహోమం దాగుంది.

తొమ్మిది నెలలపాటు సాగిన పోరులో దాదాపు 30 లక్షల మంది చనిపోయారని బంగ్లా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆ మారణహోమం తాలూకు జ్ఞాపకాల్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఆ దేశంలో అబ్దుల్లా అనే వ్యక్తి జీనోసైడ్ మ్యూజియాన్ని ప్రారంభించారు. దక్షిణ ఆసియాలోని తొలి జీనోసైడ్ మ్యూజియం ఇది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)