అమెరికా: కార్పొరేట్ పన్ను రాయితీల బిల్లుకు రిపబ్లికన్లు రెడీ

  • 16 డిసెంబర్ 2017
రిపబ్లికన్ నేతలతో ట్రంప్ భేటీ Image copyright Getty Images
చిత్రం శీర్షిక అమెరికా పన్ను నియమావళిని పునర్‌వ్యవస్థీకరించడానికి ఒక ప్రణాళికా రచన కోసం రిపబ్లికన్లు కొన్ని నెలలుగా సమావేశమవుతున్నారు

30 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్న పన్నుల విధానాన్ని పునరుద్ధరిస్తూ రిపబ్లికన్లు ఓ బిల్లును ప్రతిపాదించారు.

ప్రస్తుతం 35శాతం ఉన్న కార్పొరేట్ పన్నును 21శాతానికి తగ్గిస్తూ ఉభయసభల్లోని రిపబ్లికన్లు బిల్లును రూపొందిందారు.

ఈ బిల్లు ప్రకారం.. గరిష్ఠ వ్యక్తిగత ఆదాయ పన్ను 39.6 శాతం నుంచి 37 శాతానికి తగ్గుతుంది. గత ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ పన్నులను తగ్గిస్తానంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

దానికి కొనసాగింపుగానే క్రిస్ట్‌మస్‌లోగా ఈ బిల్లును చట్టబద్ధం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ బిల్లు ధనికులకు మాత్రమే మేలు చేస్తుందని డెమోక్రట్‌లు వాదిస్తున్నారు. ఈ బిల్లు వల్ల మధ్యతరగతి ప్రజలకు పాక్షికంగానే లాభం చేకూరుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ విధానం వలన రానున్న పదేళ్లలో దేశంపై 1.4 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ. 89,71,270 కోట్లు) భారం పడుతుందని పన్నుల విధానంపై వేసిన నిష్పక్ష కమిటీ వివరించింది.

ప్రస్తుతం 20 ట్రిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 12.8 కోట్ల కోట్లు) జాతీయ రుణం మరింత భారంగా మారుతుందని కమిటీ తెలిపింది.

సెనేట్, హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్.. ఉభయసభల్లోనూ రిపబ్లికన్లకు మెజారిటీ ఉండడంతో వచ్చే వారంలోనే ఈ బిల్లుకు ఆమోదం లభించనుంది.

Image copyright Getty Images

కొన్ని గంటల చర్చ అనంతరం శుక్రవారం నాడు ఈ ప్రకటన వెలువడింది. సెనేటర్లు మాక్రో రుబియో, బాబ్ కోర్కర్‌లు కొన్ని మార్పుచేర్పులతో ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.

ఇవి తనకు ఉత్కంఠభరితమైన క్షణాలని సభా వ్యవహారాల కమిటీ ఛైర్మన్ కెవిన్ బ్రాడీ అన్నారు. ఈ బిల్లు వెనక 31 సంవత్సరాల శ్రమ ఉందని ఆయన అన్నారు.

ఈ బిల్లు ట్రంప్‌కు ఓట్లు రాలుస్తుందా?

ఈ సరికొత్త పన్నుల విధానం అతి త్వరలోనే చట్టంగా రూపొందనుంది. రిపబ్లికన్ పార్టీలోని విమర్శకులను, బడా వ్యాపారవేత్తలను ఈ బిల్లు తప్పక సంతృప్తి పరుస్తుంది. కానీ.. 2018లో అమెరికన్ కాంగ్రెస్‌కు జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో దీని ప్రభావం ఏ విధంగా వుంటుందో అన్న అనుమానాలూ ఉన్నాయని వాషింగ్టన్‌లోని బీబీసీ ప్రతినిధి ఆంథోనీ జర్చర్ తెలిపారు.

కానీ.. సామాజిక అసమానతలను మరింత పెంచే విధంగా ఈ బిల్లును రూపొందిచారని ఐక్యరాజ్య సమితి సీనియర్ అధికారి అన్నారు.

నిజనిర్ధారణ కమిటీలో భాగంగా అమెరికాలో పర్యటించిన ఫిలిప్ ఆల్‌స్టన్ ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ బిల్లు గురించి ఆయన ''సమాజంలోని అసమానతలను హఠాత్తుగా పెంచే అంశం'' అని వ్యాఖ్యానించారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు

ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం

ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?

పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా

చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల వల్ల భారత్‌లో ధరలు పెరుగుతాయా?

క్యాన్సర్ చికిత్స పేరుతో యూట్యూబ్ నకిలీ వీడియోలతో సొమ్ము చేసుకుంటోందా?