అమెరికా యుద్ధ విమానాల నుంచి చిత్రీకరించినట్లు చెబుతున్న ఈ వీడియోలో ఎగురుతున్నది ఏంటి?
పరితోష్ వాసిరెడ్డి, బీబీసీ తెలుగు
గుర్తించలేని ఎగిరే వస్తువు (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ - యూఎఫ్‌వో) ఉన్న వీడియోని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం విడుదల చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. మరి ఈ వీడియోలో ఏముంది?
పెంటగాన్ 2007 నుంచి 2012 వరకు యూఎఫ్‌వోలపై ఒక రహస్య కార్యక్రమం చేసింది. దీన్ని 2012లో విరమించారు.
ఈ కార్యక్రమం కోసం 20 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెట్టారని అంచనా.
ఈ నేపథ్యంలో ఈ వీడియోను ధ్రువీకరించేందుకు బీబీసీ తెలుగు ప్రతినిధి పరితోష్ వాసిరెడ్డి.. పెంటగాన్ అధికార ప్రతినిధితో టామ్ క్రోసన్‌తో మాట్లాడారు.
యూఎఫ్‌వోలపై మాట్లాడటానికి ఈయనకు అధికారం ఉంది.
ఈయన బీబీసీ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతున్నపుడు వీడియోను విడుదల చేయలేదంటూనే.. అది నకిలీదా అసలుదా అనేది తాను తేల్చి చెప్పలేను అన్నారు.
మా ప్రతినిధికి.. టామ్ క్రోసన్‌కి మధ్య జరిగిన సంభాషణ
బీబీసీ తెలుగు ప్రతినిధి: ఈ వీడియో మీ వెబ్‌సైట్‌లో దొరకడం లేదు. మేం ఎక్కడి నుంచి తీసుకోగలం?
టామ్: మేం ఈ వీడియోను విడుదల చేయలేదు. దీన్ని ఎలా తీసుకుంటారో మాకు తెలియదు.
బీబీసీ తెలుగు ప్రతినిధి: మరి ఆ వీడియోలో ఉన్నది నిజమేనా?
టామ్: దాన్ని నేను ధృవీకరించలేను.
బీబీసీ తెలుగు ప్రతినిధి: మరి ఇది ఫేక్ వీడియోనా?
టామ్: నో. ఐ కాన్ట్ సే దట్ (నేను చెప్పలేను)
బీబీసీ తెలుగు ప్రతినిధి: మరి న్యూయార్క్ టైమ్స్ ఈ వీడియో మీదని చెప్పింది?
టామ్: వారికి ఎలా లభించిందో నాకు తెలియదు.
బీబీసీ తెలుగు ప్రతినిధి: ఆ యూఎఫ్‌వోలను వెంటాడుతున్న యుద్ధ విమానాల వివరాలను కూడా చెప్పారు కదా?
టామ్: నేవీ కూడా ఆ వీడియోను విడుదల చేయలేదు.
బీబీసీ తెలుగు ప్రతినిధి: అయితే.. మీరు ఈ వీడియోను కొట్టి పారేయడం లేదు అలాగే ధ్రువీకరించనూ లేదు..
టామ్: నో. నేను ఏ ప్రకటనా చేయలేను.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)