కెనడా: 70 ఏళ్ల తర్వాత క్రిస్మస్‌ విడిగా జరుపుకుంటున్న వృద్ధ జంట

  • 20 డిసెంబర్ 2017
హర్బర్ట్ గుడీన్, ఆండ్రీ గుడీన్ Image copyright Facebook/ Dianne Phillips
చిత్రం శీర్షిక 73 సంవత్సరాల దాంపత్యానికి వీడ్కోలు చెబుతున్నారు

కెనడాలో ఓ వృద్ధ జంట బలవంతంగా విడిపోవాల్సి వస్తోంది. శాశ్వతంగా వేరు చేసే మృత్యువు సమీపించక ముందే.. ఇద్దరూ వేరవుతున్నారు.

ఏడు దశాబ్దాల దాంపత్య జీవితంలో ఈ క్రిస్మస్‌ను ఒంటరిగా జరుపుకుంటున్నారు. భర్త హర్బర్ట్ గుడీన్ వయసు 91. భార్య ఆండ్రీ గుడీన్ వయసు 89.

73 ఏళ్ల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు. ప్రతి సంవత్సరమూ క్రిస్మస్‌ను ఇద్దరూ కలిసే జరుపుకుంటారు. కానీ ఈసారి అలా కాదు.

క్రిస్మస్‌కు వారం ముందే.. హర్బర్ట్ గుడీన్ తన భార్యను వదిలి వెళ్లాలి.

ప్రస్తుతం ఇద్దరూ ప్రభుత్వం నిర్వహించే కేర్ సెంటర్‌లో ఉంటున్నారు. ఇప్పుడు హర్బర్ట్ గుడీన్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన వెంటనే హాస్పిటల్లో చేరాలని అధికారులు ఆదేశించారు.

అది కూడా ఈ వారాంతంలోనే! ఇప్పుడు వీరి కథ కెనడాలో ఓ సంచలనం.

''నిన్న మా అమ్మానాన్నలతో మాట్లాడాను. నాతో మాట్లాడుతూ అమ్మ ఏడ్చేసింది. మా నాన్న ఏడుపు కూడా నాకు వినిపించింది. 'క్రిస్మస్‌ ముగిసేవరకూ వాళ్లు ఆగచ్చు కదా! ఇప్పుడే వెళ్లాలంట.. ఇక మా పండగలన్నీ ముగిసినట్టే..!!' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది'' అని వారి కూతురు డయాన్ ఫిలిప్స్ తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో రాశారు.

ఫిలిప్స్ పోస్ట్‌ను ఇంతవరకూ 15,000 మంది షేర్ చేశారు.

''గత శుక్రవారం కేర్ సెంటర్‌ అధికారులు నాకు ఫోన్ చేశారు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, మెరుగైన వైద్యం కోసం ఆయన్ను నర్సింగ్ హోమ్‌కు పంపాలని చెప్పారు'' అని ఆమె అన్నారు.

ఈ విషయంలో వెంటనే ఓ నిర్ణయానికి రాలేకపోయానని ఫిలిప్స్ చెబుతున్నారు.. తన తండ్రిని నర్సింగ్ హోమ్‌కు పంపాలని అధికారులు తనను ఒత్తిడి చేశారని అన్నారు.

క్రిస్మస్‌ అయ్యేంతవరకూ ఇద్దర్నీ ఒకే చోట ఉంచాలని వారం రోజులు గడువు కోరినా.. అధికారులు ఒప్పుకోలేదని ఫిలిప్స్ తెలిపారు.

Image copyright Facebook / Dianne Phillips
చిత్రం శీర్షిక క్రిస్‌మస్‌ ముగిసేవరకూ వాళ్లు ఆగచ్చు కదా! ఇప్పుడే వెళ్లాలంట.. ఇక మా పండగలన్నీ ముగిసినట్టే..!!

''ఇక్కడ నివసించే వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించాక మేమేం చేయలేం. ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందే'' అని ఆ కేర్ సెంటర్ ప్రతినిధి ఫేస్‌బుక్‌లో స్పందించారు.

''నిబంధనలను అతిక్రమించడం చట్ట విరుద్ధం. అలా చేస్తే నా ఉద్యోగం పోతుంది. ఆయన్ను నర్సింగ్ హోమ్‌కు పంపాలని ఆదేశాలు వచ్చేశాయి. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు'' అని కేర్ సెంటర్ ప్రతినిధి తెలిపారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

‘#StopTeluguImposition’: తెలుగు భాషను తమపై రుద్దవద్దని తమిళులు ఎందుకు అంటున్నారు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌ మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచండి: తెలంగాణ హైకోర్టు

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 3 స్థానాల్లో గెలుపు, 9 స్థానాల్లో ఆధిక్యం

'ఒక ఎంపీ నన్ను రేప్ చేశాడు.. కానీ, నా తండ్రి ఎవరికీ చెప్పకుండా దాచేయమన్నాడు’ - మాజీ ప్రధాని కుమార్తె

దిల్లీ అగ్నిప్రమాదం: ‘ముగ్గుర్ని కాపాడా.. కానీ, నా సోదరుడిని కాపాడుకోలేకపోయా’

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌' మీద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌.. ఏ తుపాకీతో కాల్చారనే అంశాలపై ఎన్‌హెచ్ఆర్‌సీ దృష్టి