చెర్నోబిల్: ఒకప్పుడు భయానక ప్రాంతం, ఇప్పుడు విహార స్థలం!

  • 22 డిసెంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచెర్నోబిల్: భయానక ప్రాంతం, ఇప్పుడు విహార స్థలం!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ప్రదేశానికి విహార యాత్రకు వెళ్లే సాహసం చేయగలరా?

ప్రపంచంలోనే అత్యంత భయానకమైన అణు ప్రమాదం ధాటికి చిన్నాభిన్నమైన ప్రాంతం ఉక్రెయిన్‌లోని 'చెర్నోబిల్'. కానీ, ఇప్పుడది ఆ దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల జాబితాలో చేరిపోయింది.

చెర్నోబిల్ దుర్ఘటన 31 ఏళ్ల క్రితం జరిగింది. అప్పటి నుంచీ ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఎవరూ సాహించేవారు కాదు.

దాంతో ఆ ప్రాంతాన్ని సురక్షితంగా తీర్చిదిద్దేందుకు, ప్రజల్లో ఉన్న భయాన్ని పొగొట్టేందుకు ఉక్రెయిన్ చర్యలు చేపట్టింది. అందుకు 'యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీ కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్'తో పాటు, అనేక సంస్థలు, దేశాలూ సాయం అందించాయి.

పేలిన రియాక్టర్ నుంచి రేడియేషన్ వెలువడకుండా అడ్డుకునేందుకు ఆ రియాక్టర్‌ను భారీ నిర్మాణంతో కప్పివేశారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపేలిన అణు రియాక్టర్‌ను ఇలా మూసివేశారు.

అందుకు యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీ కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్(ఈబీఆర్‌డీ) దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసింది.

275 మీటర్ల వెడల్పు, 108 మీటర్ల ఎత్తు ఉన్న కాంక్రీటు, ఉక్కుతో భారీ వక్రాకార షీల్డ్‌ను ప్లాంటుకు దూరంలో రూపొందించి, దాన్ని రియాక్టర్ మీదకు తీసుకెళ్లారు.

36,000 టన్నుల బరువైన ఈ నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్ద కదిలే నిర్మాణమని చెబుతారు.

Image copyright ANDREW KRAVCHENKO

ఇప్పుడు చెర్నోబిల్ ప్రాంతం సురక్షితమేనని ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతోంది.

పర్యాటకులు ఎలాంటి భయమూ లేకుండా ఇక్కడి ప్రకృతి అందాల్ని ఆస్వాదించొచ్చని, ప్రత్యేకంగా వసతి ఏర్పాట్లు కూడా చేసింది.

కానీ, ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాల్సి ఉంటుంది. నేలపై పడిన ఏవస్తువూనే తాకకూడదు.

రేడియేషన్ అధికంగా ఉన్న ప్రదేశాల్లోకి ప్రవేశం నిషిద్ధం.

Image copyright ANDREW KRAVCHENKO
చిత్రం శీర్షిక రాత్రి బస చేసేందుకు ప్రభుత్వం వసతి గృహాన్ని కూడా నిర్మించింది.

1986 జూలై 26న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలోని ఓ రియాక్టర్ పేలిపోయింది. ఆ దుర్ఘటనలో 30 మంది మరణించారు. సమీప గ్రామాల్లోని దాదాపు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Image copyright ANDREW KRAVCHENKO
చిత్రం శీర్షిక ఎవరైనా రేడియేషన్ స్థాయిని గుర్తించే స్కానర్‌ను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.

పర్యాటకంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన చర్యలు మంచి ఫలిస్తున్నాయి.

దాంతో 2011 నుంచి చెర్నోబిల్ ప్రాంతంలో పర్యాటకుల అలికిడి కనిపిస్తోంది.

అమెరికా, బ్రెజిల్, పోలాండ్, బ్రిటన్ తదితర దేశాల నుంచి వేల మంది టూరిస్టులు ఎక్కువగా వస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

Image copyright ANDREW KRAVCHENKO
చిత్రం శీర్షిక ఇవాన్ సెమెన్‌యుక్, స్థానికుడు

తమకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని 29 ఏళ్లుగా అక్కడ ఉంటున్నవారు చెబుతున్నారు. మీడియానే లేనిపోని భయాలు సృష్టిస్తోందని అంటున్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్: శాసన మండలిలో అసలేం జరిగింది? సెలక్టు కమిటీ ఏం చేస్తుంది

బెజోస్ ఫోన్ హ్యాకింగ్: అమెజాన్ బిలియనీర్ ఫోన్‌ని సౌదీ యువరాజు హ్యాక్ చేశారా?

రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తులు: 2013 నుంచి ఎన్ని ఆమోదించారు.. ఎన్ని తిరస్కరించారు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్.. ఇది ఎలా పనిచేస్తుంది

రాజధాని రగడ-రాజకీయ క్రీడ : ఎడిటర్స్ కామెంట్

ప్రెస్ రివ్యూ: కక్షతో మేనమామ ఇంట్లో పెట్రోలు పోసి నిప్పుపెట్టిన వ్యక్తి.. ముగ్గురి మృతి

సాయిబాబా ఎక్కడ జన్మించారు... షిర్డీలోనా... పత్రిలోనా

పల్లేడియం: ఈ లోహం ధర బంగారాన్ని దాటేసింది.. ఎందుకు

చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఆరుగురి మృతి