దక్షిణ కొరియా: జిమ్‌లో అగ్నిప్రమాదం, 29మంది మృతి

  • 21 డిసెంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionదక్షిణ కొరియా: జిమ్‌లో అగ్నిప్రమాదం, 29మంది మృతి

దక్షిణ కొరియాలోని ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో 29మంది చనిపోయారు. మరెంతోమంది గాయపడ్డారు.

జచన్ నగరంలో ఎనిమిది అంతస్తులున్న ఓ స్పోర్ట్స్ కేంద్రం బేస్‌మెంట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించిడంతో మంటలు త్వరగానే ఆదుపులోకి వచ్చినా భారీ ఆస్తి, ప్రాణ నష్టం తప్పలేదు.

ప్రమాదంలో ఎక్కువమంది బాధితులు భవనంలోని రెండో అంతస్తులో ఉన్న స్టీమ్ బాత్ సెంటర్‌(సానా అని పిలిచే ఆవిరి స్నానాల గది)లో చిక్కుకుపోయారు.

Image copyright EPA

భవనంలో ఇంకా గాలింపు చర్యలు జరుగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

‘ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టూ దట్టమైన విష వాయువులు వ్యాపించాయి. దాంతో చాలా మంది వేగంగా తప్పించుకోలేకపోయారు’ అని నేషనల్ ఫైర్ ఏజెన్సీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

Image copyright Getty Images

‘భవనం పై అంతస్తు నుంచి 20 మందిని రక్షించాం. ప్రమాదం నుంచి బయటపడ్డ చాలామందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాం’ అని అధికారులు వివరించారు.

దాదాపు 60మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారనీ, దట్టమైన పొగ వారి పనికి ఆటంకం కలిగిస్తోందనీ అన్నారు.

ప్రమాదం చోటు చేసుకున్న భవనంలో జిమ్‌తో పాటు స్టీమ్ బాత్ కేంద్రం, రెస్టరెంట్లు ఉన్నాయి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు