ఫ్యాషన్ 2018 : అదరగొట్టే ఆరు ట్రెండ్స్

  • 25 డిసెంబర్ 2017
2018లో ఫ్యాషన్ Image copyright Getty Images

పదిమందిలో ప్రత్యేకంగా కనపడాలని ఎవరికి మాత్రం ఉండదు?

వేడుక ఏదైనా నలుగురి చూపులు మీ వైపు తిప్పేది దుస్తులే కదా!

అందువల్లే ఫ్యాషన్ అంటే పడిచచ్చే వాళ్లకు కొదువ ఉండదు.

ఫీదర్స్ నుంచి ప్లాస్టిక్ వరకు, పర్పుల్ నుంచి పోకా డాట్స్ వరకు దుస్తులు.. లండన్, పారిస్, మిలాన్, న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లలో ఆకట్టుకుంటున్నాయి.

ఆ ట్రెండ్స్ ఏమిటో మీరూ చూడండి. కొత్త ఏడాది (2018)లో సరికొత్త లుక్‌తో ఆకట్టుకోండి.

Image copyright Getty Images

50 షేడ్స్ ఆఫ్ లావెండర్

కొత్త ఏడాదిలో మీరు కొత్తగా కనిపించాలంటే పర్పుల్‌ రంగును ట్రై చేయాల్సిందే అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు.

తేలికగా ఉండే ఫ్లోటీ డ్రెస్సులు అయినా, స్లిమ్‌గా ఉండే సూట్స్ అయినా అదరహో అనిపిస్తాయి.

మైఖేల్ కోర్స్, వాలెంటినో, బొట్టెగా వెనెటా, ఎర్డెమ్ వంటి బ్రాండ్లు ఇటువంటి దుస్తులు రూపొందిస్తున్నాయి.

Image copyright Getty Images

డబుల్ డార్క్ డెనిమ్

డబుల్ డార్క్ డెనిమ్.. ఇవి ధరిస్తే స్లిమ్‌గా కనిపిస్తారు. అందుకే మహిళలకు ఇవి ఎంతో ఇష్టమైనవి.

వీటికి దాదాపు దశాబ్దకాలం చరిత్ర ఉంది.

నేడు సరికొత్త హంగులతో మరింత ఆకర్షణీయంగా ఇవి తయారయ్యాయి.

ఫెండి, టామ్ ఫోర్డ్, క్లోయి, నీనా రిక్కీ వంటి బ్రాండ్లు వీటిని తయారు చేస్తున్నాయి.

Image copyright Getty Images

ప్లాస్టిక్స్

ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్‌కు ఆదరణ లభిస్తోంది.

గత సీజన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన వినైల్‌ను ఇది అధిగమిస్తోంది.

ట్రెంచ్ కోట్స్, మోకాళ్ల వరకు ఉండే బూట్లు, హ్యాండ్ బ్యాగులు వంటివి ప్లాస్టిక్‌తో రూపొందుతున్నాయి.

నీటికి తడవదు. ఉతకడం కూడా ఎంతో సులభం.

చానెల్, కెల్విన్ క్లెయిన్, బాల్‌మెయిన్, మార్క్ జాకోబ్స్ వంటి బ్రాండ్లు ఇందులో ప్రముఖమైనవి.

Image copyright Getty Images

ఫ్రింజింగ్ అండ్ ఫీదర్స్

కొత్త ఏడాదిలో భిన్నంగా కనిపించాలంటే ఫ్రింజింగ్, ఫీదర్స్‌ను ప్రయత్నించొచ్చు.

ఫ్యాషన్ వేదికల మీద హొయలు పోతున్న ఈ ట్రెండ్ ఇప్పటికే నగరాలకు పాకింది.

డియోర్, లోవెవే, సెలీన్, సాల్వటోరే ఫెర్రగామో వంటి బ్రాండ్లు వీటిని డిజైన్ చేస్తున్నాయి.

Image copyright Getty Images

చక్కని చుక్కలు

తెల్లని బ్యాక్‌గ్రౌండ్‌పై నల్లని చుక్కలు క్లాసిక్ లుక్ ఇస్తాయి.

ప్రధానంగా స్ర్పింగ్ లేదా సమ్మర్‌లో ఇవి బాగా ఉంటాయి.

సీజన్ ఏదైనా ఇవి బాగా నప్పుతాయి.

కరోలినా హరెరా, జాసన్ వూ, అలెగ్జాండర్ వాత్యర్ వీటిని తయారు చేస్తున్నాయి.

Image copyright Getty Images

ద ట్రెంచ్ 2.0

2018లో ట్రెంచ్ కోట్ సరికొత్త హంగులను సంతరించుకోనుంది.

డిజైనర్లు తమ అభిరుచులకు తగినట్లుగా వీటికి ఫ్యాషన్ అద్దుతున్నారు.

లేటెస్ట్ ట్రెండ్‌లను అందిపుచ్చుకోవాలంటే అలెగ్జాండర్ మెక్‌క్వీన్, లోవెవె, డయోర్ వంటి బ్రాండ్లను ప్రయత్నించవచ్చు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు