అమెరికా: వైట్‌హౌస్‌లో చారిత్రక చెట్టు తొలగింపుకు మెలానియా ట్రంప్ ఆదేశం

  • 29 డిసెంబర్ 2017
మంగోలియా చెట్టును తొలగిస్తోన్న ఫోటో Image copyright EPA

ఆ చెట్టు వయసు 200 సంవత్సరాలు!

ప్రస్తుతం దానికి జబ్బు చేసింది. వైద్యం చేశారు.. కానీ నయం కాలేదు.

వెంటనే ఆ చెట్టుకు ఆపరేషన్ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆదేశించారు..!

చెట్టేంటి.. దాని కథేంటి.. ఈ వార్తేంటి..? కంగారు పడకండి.

ఆ చెట్టు పేరు 'జాక్సన్ మగ్నోలియా'. అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్‌లో ఉంటుంది.

ఇది 200 ఏళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..! ప్రస్తుతం ఈ చెట్టును నరికేస్తున్నారు.

జాక్సన్ మంగోలియాను అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్.. తన భార్య రేచల్ జాక్సన్‌ జ్ఞాపకార్థం వైట్ హౌస్ ప్రాంగణంలో నాటారు.

ఈ మంగోలియా చెట్టు జీవితంలో ఎన్నో చారిత్రాత్మక సందర్భాలున్నాయి. 1928 - 1988 మధ్య చెలామణిలో ఉన్న 20 డాలర్ల నోటుపై కూడా ఈ చెట్టు బొమ్మను ముద్రించారు.

కానీ.. ప్రస్తుతం ఈ చెట్టు బాగా క్షీణించిందని నిపుణులు తెలిపారు. దీంతో.. ఈ చెట్టును నరికేయమని ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ ఆదేశించారు.

అయితే.. చెట్టును పూర్తిగా పెకిలించకుండా.. దాని విత్తనాలను భద్రపరచాలని మెలానియా కోరారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి స్టిఫానీ గ్రీషమ్ తెలిపారు.

ఆ విత్తనాలను తిరిగి అదే స్థానంలో నాటాలని మెలానియా కోరారని తెలిపారు.

అధ్యక్షుడి హెలికాప్టర్‌ టేక్ ఆఫ్ అయ్యే సందర్భాల్లో మీడియా ప్రతినిధులు, సందర్శకులు తరచూ ఈ చెట్టు ముందు నిల్చుంటారు.

కానీ ఈ చెట్టు క్షీణించిపోతున్న సందర్భంలో వారిపై ఎక్కడ పడుతుందోనన్న భయంతోనే మెలానియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టిఫానీ గ్రీషమ్ తెలిపారు.

Image copyright AFP

మాజీ అధ్యక్షుడి భార్య రేచల్ జాక్సన్‌కు ఎంతో ఇష్టమైన 'మగ్నోలియా చెట్టు' మొలకను టెనెస్సీ రాష్ట్రంలోని తమ తోట నుంచి తెప్పించారు.

1970 లోనే ఈ చెట్టుకు సమస్య మొదలైంది. ఈ చెట్టుకు ఓ పెద్ద తొర్ర ఏర్పడటంతో కొంత భాగాన్ని తొలగించి, సిమెంట్ వేశారు. దీంతో ఈ చెట్టు క్షీణించి పోవడం మొదలు పెట్టింది.

1981లో సిమెంట్‌ను తొలగించారు. చెట్టు కూలిపోకుండా.. ఓ పెద్ద స్తంభాన్ని ఆధారంగా ఉంచి, తీగల సాయంతో చెట్టును పట్టి ఉంచారు.

మొదట్లో అంతా సవ్యంగానే గడిచింది. స్తంభం, తీగల సాయంతో పరిస్థితి మెరుగుపడిందన్న అమెరికా నేషనల్ ఆర్బొరీటమ్ రిపోర్టును సిఎన్ఎన్ వార్తా సంస్థ ప్రస్తావించింది.

ఈ మంగోలియా చెట్టు తన జీవిత కాలంలో 39 మంది దేశాధ్యక్షులను, అమెరికా సివిల్ వార్‌ను, రెండు ప్రపంచ యుద్ధాలనూ చూసింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె ఛెల్సీ క్లింటన్ ఈ చెట్టు గురించి ట్వీట్ చేశారు.

ఇన్నేళ్లూ ఈ మంగోలియా చెట్టును సంరక్షించిన వారికి, ఈ విత్తనాన్ని అదే స్థానంలో తిరిగి నాటేందుకు ప్రయత్నిస్తోన్న మెలానియా ట్రంప్‌కూ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

రాయల్‌ వశిష్ట: గోదావరిలో 300 అడుగుల లోతులో మునిగిన బోటును ఎలా బయటకు తీశారంటే..

#100WOMEN: ‘మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది’

బ్యాంకుల విలీనాన్ని ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

ఇన్ఫోసిస్: సీఈఓ, సీఎఫ్ఓ‌లపై వచ్చిన ఆరోపణలపై విచారణను ప్రారంభించిన ఐటీ సంస్థ

గోదావరిలోంచి బయటపడ్డ రాయల్‌ వశిష్ట బోటు.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు

ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ

చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ

భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్