2017లో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది?

2017లో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది?

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ-IMF అంచనాల ప్రకారం భారత్, జపాన్, చైనా రష్యా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలు అనుకున్న దానికంటే బాగానే ముందుకు సాగుతున్నాయి.

కొన్నేళ్ల కింద సంభవించిన ఆర్ధిక సంక్షోభం తరువాత జి 7 దేశాలు తమ వడ్డీ రేట్లు కూడా పెంచుతున్నాయి. ప్రపంచ వాణిజ్య వ్యవస్థ కూడా కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా ప్రస్తుతానికి కొద్దిగా పర్వాలేదు అనే స్థితిలో ఉంది.

డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో అమెరికా బహుపాక్షిక వాణిజ్య ఒప్పందాల నుండి వెనుదిరుగుతున్నా పసిఫిక్ రింలో ఉన్న ఎన్నో దేశాలు కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

అమెరికా తప్ప మిగిలిన ఉత్తర అమెరికా ఖండానికి చెందిన దేశాలు నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌ను సవ్యంగా ఉంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)