హోలోకాస్ట్: గతాన్ని భద్రపరుస్తున్న.. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సృస్టించిన మారణ హోమం ప్రత్యక్ష సాక్షి
యూదుల ఊచకోత నుంచి ప్రాణాలతో బయటపడిన అతి కొద్దిమందిలో ఇవా ష్క్లాస్ ఒకరు. ఆనాటి పరిస్థితులను భావి తరాలకు అందించేందుకు ఆమె తన వంతు కృషి చేస్తున్నారు.
యూదుల ఊచకోత సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను రికార్డు చేస్తున్నారు. 3 డైమెన్షనల్ ఇంటరాక్టివ్ టెక్నాలజీని ఉపయోగించి, గతాన్ని పొందుపరుస్తున్నారు.
అంటే ఎవరైనా వర్చ్యువల్‌గా ఆమెను ప్రశ్నలు అడిగి.. ఆనాటి ఘటనలను, అప్పటి పరిస్థితులను తెలుసుకోవచ్చు.
ఇంతకీ.. ఇవా ష్క్లాస్ ఎవరో తెలుసా? 'ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గర్ల్' పుస్తక రచయిత, ఏన్ని ఫ్రాంక్‌కి స్టెప్ సిస్టర్.
ఎనభై ఎనిమిదేళ్ల ఇవా ష్క్లాస్.. ఔష్ విట్జ్ మారణహోమం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆమె తన గతాన్ని వివరిస్తూ, దాన్ని చిత్రీకరిస్తున్నారు.
ఇప్పటి ప్రజలకే కాదు, భవిష్యత్ తరాలకు కూడా చరిత్రను భద్రంగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా అప్పటి యూదుల ఊచకోత గురించి, వర్చ్యువల్‌గా ఆమెను ప్రశ్నలు అడిగి తెలుసుకోవచ్చు.
"మేం చనిపోయిన తర్వాత గత చరిత్రను భావి తరాలకు ఎవరు చెబుతారని ప్రాణాలతో బయటపడిన మాలో కొద్దిమంది ఆందోళన చెందుతున్నారు. అది చాలా ముఖ్యమని?" అని ఇవా అన్నారు.
అప్పటి ఊచకోత నుంచి ఎలా తప్పించుకున్నారు? గతం వల్ల, జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? అనే విషయాలను న్యూయార్క్‌లోని యూదుల హెరిటేజ్ మ్యూజియంలో ఇవాను అడిగి తెలుసుకోవచ్చు.
"అప్పటి నిర్బంధ శిబిరంలో అత్యంత భయానక సంఘటన ఏది? అనేది నాకు ఎదురయ్యే ప్రశ్నల్లో ప్రధానమైనది. ఒక రోజు నా తల్లిని, గ్యాస్‌తో హింసించి చంపడానికి తీసుకెళ్లారు. అపుడు ఇద్దరం విడిపోయాం. ఇక నా తల్లిని కోల్పోయా అనుకున్నా. అదృష్టవశాత్తూ, ఆమె బయట పడ్డారు. మూడు నెలల తరువాత తిరిగి కలుసుకున్నాం'' అని ఇవా ఆమె గతాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇవా, తన కథను దాదాపు 1000 ప్రశ్నల్లో సమాధానాలుగా చెప్పారు. ఐదు రోజుల పాటు ఒక చిత్ర దర్శకుడు, ఆమె కథను మొత్తం రికార్డ్ చేశారు.
మారణ హోమంలో ఇవా తన తండ్రిని, సోదరుడిని కోల్పోయారు. అయితే, తనకు ఎలాంటి కోపం గాని, ద్వేషం గానీ లేవంటున్నారామె. కానీ, ప్రజలు గతాన్ని తెలుసుకోవాలని ఆమె ఆశ పడుతున్నారు.
"యువ శక్తికి మేము నేర్పించగలిగేది ఇదే. వాళ్లను గతానికి దగ్గరగా తీసుకెళ్లి, ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించాలనే భావన వారిలో కలగాలని." అని ఆమె అన్నారు.
మా ఇతర కథనాలు:
- 100 మంది మహిళలు: నారీలోకానికి నాడీమంత్రం
- 2017: దంగల్ బాహుబలి.. రెండూ రెండే
- అవునా.. ఐన్‌స్టీన్‌ది మొద్దు నిద్రా?
- ప్రశాంత నిద్ర కోరుకునే మీకోసమే ఈ 10 విషయాలు
- ప్రేమకథ: బాలీవుడ్.. జర్మనీ.. ఓ సినిమాటోగ్రాఫర్
- జర్మనీలో రాజకీయ సంక్షోభం.. మెర్కెల్‌కు ఎదురుదెబ్బ
- ఫ్రెంచ్ సావిత్రి దేవికి జర్మన్ హిట్లర్‌కు ఏమిటి సంబంధం?
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)