డేవిడ్ లిట్: ఒబామా ప్రసంగాలు అంత సరదాగా ఉండటానికి కారణం ఇతనే!
‘‘నాకు నా మొదటి రోజు ఇంకా గుర్తుంది. వైట్ హౌస్ గేట్ దాటి లోపలకి వెళ్తున్నప్పుడు...ఒక్క క్షణం ఆగి ‘నన్ను వీళ్ళు నిజంగానే లోపలకి రానిస్తున్నారా?’ అనుకున్నాను.’’
ఇతని పేరు డేవిడ్ లిట్. 2011 నుండి 2016 వరకు ప్రెసిడెంట్ ఒబామా ప్రసంగాలను రాసినది ఈయనే.
ఇపుడు "థ్యాంక్స్ ఒబామా" అనే పుస్తక రచయిత.
తన ప్రస్థానం గురించి ఆయన ఇలా వివరిస్తున్నారు..
‘‘నేను వాషింగ్టన్ కు ఒక కామెడీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చాను. కాలేజ్ రోజుల్లో వాషింగ్టన్ డీసీ మీద రకరకాల జోక్ లు వేసేవాడిని. ఇక్కడకు వచ్చినపుడు అది బాగా ఉపయోగపడింది.
ప్రసంగాలలో నేను రాసిన ప్రతి జోక్ ను ఆయన (ఒబామా) చదివి వినిపించేటప్పుడు నాకు ఎలా అనిపించేదో ఇంకా గుర్తుంది. ఎందుకంటే ఆ క్షణం ఆ జోక్ పేలుతుందా లేదా అనేది అర్థమైపోతుంది.
ఆ జోక్ నచ్చితే దానికి వెంటనే ఇంకొన్ని చెణుకులు ఆయన అద్దేవారు. అప్పటికప్పుడు దాన్ని మరింత రసవత్తరంగా మార్చేసేవారు.’’
ఫొటో సోర్స్, david.litt/facebook
తన భార్య జాక్వీ కప్లెర్తో డేవిడ్ లిట్
‘‘ఒబామా పరిపాలనలో వాషింగ్టన్ గురించి నిజాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు, హాస్యం జోడించే సౌలభ్యం, అవకాశం పుష్కలంగా ఉండేవి.
ప్రసంగం రాసేటప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది, అదే ఆలోచన దేశాధ్యక్షుడి నోటి నుండి పదాల రూపంలో జాలువారడం ఒక అద్భుతమైన ప్రక్రియ అనిపిస్తుంది. ఆ ప్రక్రియ గురించి రాసినప్పుడు గాని, ఆలోచించినప్పుడు గాని, ఉద్వేగభరితంగా ఉంటుంది.’’
మా ఇతర కథనాలు:
- ‘ఇట్లు... ప్రేమతో నీ ఒబామా’
- ఒబామా.. హ్యారీ చిట్‌చాట్
- అందుకే ఒబామాకు భారత్ అంటే అంత ప్రేమ
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- ఇలా మొదలైంది ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌ల లవ్ స్టోరీ!
- గమ్యం: ITలో ఈ 6 కోర్సులతోనే మంచి అవకాశాలు!
- నెట్ సరే.. న్యూట్రాలిటీ సంగతేంటి?
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)