కామెడీ వైల్డ్‌లైఫ్ పోటీలు : గుడ్లగూబకు ఫస్ట్‌ ఫ్రైజ్!

  • 31 డిసెంబర్ 2017

అరుదైన.. అందమైన.. అద్భుతమైన దృశ్యాలివి. సరదాగా ఉండి.. నవ్వు తెప్పించేవి కొన్ని. ఆశ్చర్య పరిచేవి మరికొన్ని. ఔరా అనిపించేవి ఇంకొన్ని.

100 కాదు.. 200 కాదు.. 3500 ఫొటోలు. ప్రతీ ఒక్కటీ ప్రత్యేకమే. వేటి కవే సాటి. వాటికి లేదు పోటీ.

2017 కామెడీ వైల్డ్‌లైఫ్‌ పోటీల్లో అందర్ని మెప్పించిన కొన్ని ఫొటోలు మీ కోసం.

మిస్ కాకుండా అన్నీ చూడండి.

Image copyright Tibor Kercz / Barcroft Images
చిత్రం శీర్షిక కొమ్మపై పట్టుతప్పి కిందకి జారుతూ.. పట్టు కోసం పాకులాడుతున్న గుడ్లగూబ ఫొటో ఇది. ఈ ఏడాది నేచర్స్ ఫన్నీయెస్ట్‌ ఫొటోగా ఇది అవార్డు దక్కించుకుంది.

కామెడీ వైల్డ్‌లైఫ్‌ పోటీల్లో ఈ గుడ్లగూబ ఫొటోకు ఫస్ట్‌ ఫ్రైజ్ వచ్చింది.

హంగరిలో టిబొర్ కెర్జ్ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటో తీశారు.

ఈ ఫొటో తీసినందుకు టిబొర్ కెర్జ్ కెన్యా విహార యాత్ర టికెట్లు గెలుచుకున్నారు.

Image copyright Andrea Zampatti / Barcroft Images
చిత్రం శీర్షిక ఇది చిలిపి చిట్టెలుక. ఉన్నచోట ఉండకుండా పూల మొక్క పైకెక్కి ఎలా నవ్వుతుందో చూడండి. దీన్ని ఆండ్రియా జంపటి అనే ఫొటో గ్రాఫర్ ఇటలీలో తీశారు. 'భూమి మీద విభాగం'లో ఇది గెలుపొందింది.

Image copyright Troy Mayne / Bancroft images
చిత్రం శీర్షిక ఈ తాబేలు మహా ముదురు. తన దారికి అడ్డుగా వచ్చిన ఓ చేప చెంపను ఇలా చెళ్లుమనిపించింది. పాపం చేపకు ఎంత దెబ్బతగిలిందో! ఈ ఫొటో ట్రాయ్ మేని తీశారు. 'అండర్ వాటర్ విభాగం'లో ఈ ఫొటో ఎంపికైంది.

చిత్రం శీర్షిక 'ఆకాశం విభాగం'లో జాన్ త్రెల్‌ఫాల్ తీసిన ఈ ఫొటో గెలుపొందింది. విమానం వెళ్లిన దారిలో ఈ పక్షి ఎగురుకుంటూ వెళ్లడంతో ఈ ఎఫెక్ట్ వచ్చింది.

Image copyright Daisy Gilardini
చిత్రం శీర్షిక అమ్మ దగ్గర ఎన్ని కోతి వేషాలు వేసినా చెల్లుతుంది. 'తల్లి పైకి ఎక్కుతున్న పిల్ల ఎలుగుబంటి' ఫొటోను డైసీ గిలార్డిని తీశారు. కెనడాలోని మనిటొబాలో ఈ ఫొటో క్లిక్ మనిపించారు.

చిత్రం శీర్షిక హలో.. మీరు నాలా జలకాలాడగలరా! ఈ జంతువు నీటిలో సరదాగా ఈతకొడుతున్న సమయంలో పెన్నీ పాల్మర్‌ ఈ ఫోటో తీశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో క్లిక్ మనిపించారీ ఫొటో.

Image copyright Photo: Carl Henry
చిత్రం శీర్షిక ఈ పెంగ్విన్లను చూశారా? బుద్ధిగా చర్చికి వెళ్తున్నాయి! అది కూడా క్రమశిక్షణగా. దక్షిణ జార్జియాలోని దక్షిణ అట్లాంటిక్ ద్వీపంలో ఈ ఫొటోను కార్ల్ హెన్రీ తీశారు.

చిత్రం శీర్షిక ఈ కుందేలుకు ఆత్రం ఎక్కువ అనుకుంటా! నోరు చిన్నది.. కానీ ఎంత గడ్డి నోట్లో పెట్టుకుందో చూడండి. ఫొటో గ్రాఫర్ ఆలివియర్ కొలీ బెల్జియంలో ఈ చిత్రం తీశారు. అవార్డు కోసం ఎక్కువ మంది దీన్ని సిఫార్సు చేశారు.

చిత్రం శీర్షిక ఈ రెండు కోతులు బైక్‌పై రైడ్‌కి రెడీ అవుతున్నాయి. ఇండోనేషియాలోని ఉత్తర సులవెసీ ద్వీపంలో ఇలా కెమేరాకి చిక్కాయి..

Image copyright Photo: George Cathcart
చిత్రం శీర్షిక ఇది భయమా? షాకా? ఈ సీల్‌ ఏం ఆలోచిస్తోంది? జార్జ్ కాథ్‌కార్ట్‌ తీసిన ఈ ఫొటోను ఎక్కువ మంది రెకమండ్ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా శాన్‌ సిమియాన్‌లో క్లిక్ చేశారు.

Image copyright Photo: Douglas Croft
చిత్రం శీర్షిక ఈ నక్క మహా జిత్తులమారి! ఎక్కడ జాగ లేనట్టు ఇదిగో ఇక్కడే తన పని కానిస్తోంది.! అమెరికా శాన్‌జోస్‌లోని గోల్ఫ్ కోర్టులో తీసిన ఫొటో ఇది.

Image copyright Photo: Daniel Trim
చిత్రం శీర్షిక చూడండి.. ఈ చేపలు బురదలో డ్యూయెట్ పాడుకుంటున్నాయి.! థాయ్‌లాండ్‌లో డేనియల్ ట్రిమ్‌ వీటిని కెమేరాలో బంధించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు