ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఇలా జరిగాయి

  • 1 జనవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionప్రపంచవ్యాప్తంగా నగరాలు 2018కి ఇలా స్వాగతం పలికాయి

ప్రపంచమంతా 2018కి ఘనస్వాగతం పలికింది. పెద్దఎత్తున బాణాసంచా కాల్చుతూ.. సంప్రదాయ ప్రదర్శనలతో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు.

భారత్ కంటే ఏడు గంటల ముందే న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్‌ 2018వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.

ఉత్తరకొరియా అంటే చాలామందికి ఎప్పుడూ క్షిపణులు, అణ్వాయుధాల పరీక్షలే గుర్తొస్తుంటాయి. కానీ, ఆ దేశంలోనూ నూతన సంవత్సర వేడుకలు భారీగా నిర్వహించారు.

దేశ రాజధాని నగరం ప్యాంగ్యాంగ్‌లో పెద్దఎత్తున రంగురంగుల బాణాసంచా కాల్చారు. అనేక మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆ వేడుకలను వీక్షించారు.

ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో కొత్త సంవత్సర వేడుకల్ని పై వీడియోలో చూడొచ్చు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)