విమానాల్లో వీల్ చైర్ల కోసం ఓ తల్లి ఉద్యమం

విమానాల్లో వీల్ చైర్ల కోసం ఓ తల్లి ఉద్యమం

విమాన ప్రయాణాలు చేసే వికలాంగులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు కావాలి.

కానీ విమానాల్లో వారి కోసం ఏర్పాట్లు సరిగా లేవు. వారి కోసం ప్రత్యేకమైన సీట్లు విమానాల్లో ఉండటం లేదు. చాలా అసౌకర్యంగా ఉందని కొందరు వికలాంగులు చెబుతున్నారు.

అమెరికాలోని ఓ తల్లికి వీరి ఆవేదన అర్థమైంది. ఎందుకంటే ఆమె స్వయంగా ఓ వికలాంగ బాలుడి తల్లి.

ట్యాక్సీలు, బస్సులు, రైళ్లల్లో వికలాంగులకు ప్రత్యేకమైన కుర్చీలున్నాయి. కానీ విమానాల్లో వీరి కోసం అలాంటి ఏర్పాట్లు లేకపోవడంపై ఆమె విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే.. విమానాల్లో అలాంటి కుర్చీలను ఏర్పాటు చేసేందుకు రకరకాల డిజైన్లను రూపొందిస్తున్నారు. కానీ ఎవరి వీల్ ఛైర్లలోనే వాళ్లు ప్రయాణించేలా ఆమె ప్రయత్నిస్తున్నారు.

అందుకోసం ప్రత్యేకమైన కుర్చీలను ఆమె రూపొందిస్తున్నారు. ఆమె రూపొందించిన డిజైన్లు కూడా అమెరికా నిబంధనలకు లోబడే ఉన్నాయి.

తన ఏడేళ్ల కృషికి ఫలితం దక్కబోతోందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘‘ఇవి నాకు ఉద్విగ్న క్షణాలు.. నా కొడుకు విమానంలో సుఖంగా ప్రయాణిస్తాడు’’ అని ఆ తల్లి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)