ఇండోనేషియాలో బోటు బోల్తా పడి ఎనిమిది మంది మృతి

  • 1 జనవరి 2018
బోటు ప్రమాదం Image copyright Getty Images

ఇండోనేషియాలోని బోర్నియో సమీపంలో బోటు నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా.. మరికొందరి జాడ తెలియడం లేదు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.

అనురాగ్ ఎక్స్‌ప్రెస్ అనే బోటు ఇండోనేషియాలోని తన్జంగ్ సెలోర్ నుంచి తారకన్ మధ్య నడుస్తుంది.

40 మంది ప్రయాణికులతో బయలుదేరిన అనురాగ్ ఎక్స్‌ప్రెస్ మార్గమధ్యలో మునిగిపోయింది.

ప్రయాణికులందరూ నీటిలో పడిపోయారు. కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు.

ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరికొందరి జాడ తెలియడం లేదు.

అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.

Image copyright EPA

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.15కి ఈ ప్రమాదం జరిగిందని రెస్క్యూ ఏజెన్సీ అధికార ప్రతినిధి అన్వర్ చెప్పారు.

అయితే, ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదని ఆయన తెలిపారు.

‘ప్రమాదం ఎలా జరిగిందో మాకు తెలియదు’ అని ముల్యాడి ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు. గల్లంతైన ప్రయాణికుల కోసం ప్రస్తుతం వెతుకుతున్నామని ఆయన వివరించారు.

ఇండోనేషియాలో చిన్న చిన్న బోట్లు, పడవలే ప్రధాన ప్రయాణ సాధనలు. ఏటా వేలాది మంది ప్రయాణికులు వీటిలో ప్రయాణిస్తుంటారు.

కానీ భద్రతా ప్రమాణాలు నామమాత్రంగా ఉంటాయన్న ఆరోపణలు ఉన్నాయి.

గతేడాది జనవరి 1న జకర్తా పోర్టు నుంచి బయలు దేరిన కాసేపటికే ఒక పడవ పేలిపోయింది. ఆ మంటల్లో 20 మంది చనిపోయారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు