న్యూజీలాండ్: మందు తాగడానికి ద్వీపం తయారు చేశారు

  • 2 జనవరి 2018
తామే నిర్మించుకున్న ద్వీపంపై ఎంజాయ్ చేస్తున్న మద్యం ప్రియులు Image copyright David Saunders
చిత్రం శీర్షిక తామే నిర్మించుకున్న ద్వీపంపై ఎంజాయ్ చేస్తున్న మద్యం ప్రియులు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాన్ని తప్పించుకునేందుకు న్యూజీలాండ్‌లోని కొందరు మందు ప్రియులు ఓ క్రియేటివ్ ఐడియాతో ముందుకొచ్చారు.

ఏకంగా ఓ చిన్న ద్వీపాన్నే నిర్మించేసుకుని న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు.

కోరమాండల్ ద్వీపకల్పంలోని లోతు తక్కువగా ఉండే తైరువా నదీముఖద్వారం వద్ద ఈ సంఘటన జరిగింది.

కోరమాండల్‌లో నూతన సంవత్సరాది వేడుకల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం.

దానిని ఉల్లంఘిస్తే సుమారు 12 వేల రూపాయల జరిమానా విధిస్తారు లేదా అరెస్ట్ చేస్తారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కదా తప్పు. అందుకే తెలివిగా వీళ్లు నీళ్ల మధ్యలోనే ఓ ద్వీపాన్ని కట్టేశారు.

అక్కడే టేబుల్స్ వేసుకుని మద్యం సేవిస్తూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు.

Image copyright David Saunders
చిత్రం శీర్షిక మందుబాబుల క్రియేటివ్ ఐడియా

'అంతర్జాతీయ జలాలు'

వాళ్లంతా అప్పుడు 'అంతర్జాతీయ జలాల'లో ఉన్నారని, అందువల్ల వారికి మద్య నిషేధం వర్తించదని స్థానికులు సరదాగా మాట్లాడుకుంటుకున్నారు.

అధికారులు కూడా వీళ్ల ఏర్పాట్లను సీరియస్‌గా తీసుకోలేదు.

''వీళ్ల సృజనాత్మక ఆలోచన గురించి ముందే తెలిసి ఉంటే నేను కూడా వాళ్లలో కలిసుండేవాణ్ని'' అని స్థానిక పోలీస్ కమాండర్ జాన్ కెల్లీ సరదాగా వ్యాఖ్యానించారు.

స్థానిక ఫేస్‌బుక్ గ్రూప్ తైరువా చిట్‌చాట్ కు చెందిన డేవిడ్ శాండర్స్ ఆ ద్వీపంపై మద్యం సేవిస్తున్న చిత్రాలను పోస్ట్ చేశారు.

అయితే స్థానిక కమ్యూనిటీ ఆర్గనైజర్ నాడీ వాట్స్ మాత్రం నిషేధాన్ని నీరు కారుస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు