ఆఫ్రికా: చెత్త కుప్పల మధ్యలో అందమైన భామల ఫొటోలు ఎందుకు తీస్తున్నారంటే..

  • 4 జనవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇనా మకోసి అందరిలాంటి ఫొటోగ్రాఫర్ కాదు

ఇనా మకోసి అందరిలాంటి ఫొటోగ్రాఫర్ కాదు. ఆమె చెత్త కుప్పల మధ్యలోనే అందమైన మోడళ్ల ఫొటోలు తీస్తారు.

ఆ ఫొటో షూట్‌ల ద్వారా స్థానికుల్లో అపరాధ భావనను తీసుకొచ్చి చెత్తను శుభ్రం చేయించాలన్నది ఆమె ఉద్దేశం.

‘అందమైన అమ్మాయి చెత్త మధ్యలో కూర్చొని ఎందుకు ఫొటో దిగుతోందని అందరూ ఆలోచిస్తారు. దాంతో తమను తాము ప్రశ్నించుకుంటారు.

ఆపైన ఆ చెత్తను శుభ్రం చేయాల్సిన బాధ్యత తమకూ ఉందని భావిస్తారు. అలాంటి ఆలోచనను అందరిలో తీసుకొచ్చి పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్న స్పృ‌హను పెంచాలన్నదే నా ప్రయత్నం’ అంటారామె.

2014లో ఇనా తొలిసారి తానుండే పికిన్ నగరంలో ఈ ఫొటోగ్రఫీ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఫొటోషూట్ జరిగిన రెండు వారాల తరవాత స్థానికులు అక్కడి చెత్తను తొలగించారు. ఆ ఫలితాలే తనను మరిన్ని ఫొటోలు తీసేలా ప్రోత్సహించాయంటారు ఇనా.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)