ప్రాణాంతక చర్మవ్యాధికి జన్యుపరమైన చికిత్స

ప్రాణాంతక చర్మవ్యాధికి జన్యుపరమైన చికిత్స

ఇది లండన్‌లోని సెయింట్ థామస్ ఆసుపత్రి. కొత్తగా ఏర్పాటు చేసిన అరుదైన వ్యాధుల చికిత్సా కేంద్రానికి వెళుతున్నారు 24 ఏళ్ళ జేమ్స్ డన్.

జీవిత కాలాన్ని కుదించివేసే అరుదైన ఈ జన్యుపరమైన చర్మ వ్యాధిని 'ఎపిడర్మోలసిస్ బులోసా' లేదా 'ఈ.బి' అని పిలుస్తారు.

యు.కేలో దాదాపు ఐదు వేల మందికి ఈ వ్యాధి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మంది బాధితులు ఉన్నారని అంచనా. జేమ్స్ చర్మం సీతాకోక చిలుక రెక్కలంత సున్నితంగా ఉంటుంది.

కొత్తగా ప్రారంభించిన ఈ కేంద్రం.. అరుదైన వ్యాధుల కోసం ప్రత్యేకమైన చికిత్సలను అందిస్తుంది. అంటే జేమ్స్ వంటి పేషెంట్లకు మెరుగైన చికిత్స అందుతుంది. నిపుణుల మధ్య సమన్వయం పెరుగుతుంది.

ఇటువంటి క్లినిక్ ఒకటి జర్మనీలో ఉంది. 9 ఏళ్ళ హసన్ ప్రయోగాత్మకమైన చికిత్స ద్వారా తన చర్మంలో 80 శాతం వరకు తిరిగి పొందగలిగాడు.

ఈ కొత్త చికిత్స.. 'ఈ.బి' ఉన్న అందరికీ పనిచేయకపోవచ్చు కానీ బ్రిటిష్ క్లినిక్‌లో.. ప్రాణాంతకమైన రోగంతో బాధపడుతున్న రోగులకు ధైర్యం కలిగించవచ్చు.

తనకు సమయం మించిపోతోందని జేమ్స్‌కు తెలుసు. అయితే ఈ కొత్త... అరుదైన వ్యాధుల చికిత్సా కేంద్రం అతనికి కొత్త నమ్మకాన్నిస్తోంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)