బయోనిక్ హ్యాండ్: కృత్రిమ చేయికి జీవస్పర్శ

బయోనిక్ హ్యాండ్: కృత్రిమ చేయికి జీవస్పర్శ

బయోనిక్ హ్యాండ్ ...స్పర్శ జ్ఞానం కలిగిన కృత్రిమ చెయ్యి. కళ్లకు గంతలు కట్టుకున్న అల్మెరినా మాస్కెరెల్లో.. తాను పట్టుకున్న వస్తువు మృదువుగా ఉందో.. గట్టిగా ఉందో తెలుసుకోగలుగుతున్నారు.

ప్రతీసారి ఆమె సరిగ్గానే గుర్తిస్తున్నారు. 25 ఏళ్ల కిందట ఓ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఆమె చేయి కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ చేయి వచ్చినట్లు అనిపిస్తుందని ఆమె అంటున్నారు.

ప్రంపచంలోనే మొదటి సారిగా రూపొందించిన స్పర్శ జ్ఞానం కలిగిన బయోనిక్ హ్యాండ్‌ను డానిష్ వ్యక్తికి అమర్చారు. కానీ, ఇది కొన్నాళ్లు ప్రయోగశాలకే పరిమితమైంది.

నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఈ కృత్రిమ చెయ్యిని ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా రూపొందించారు. అల్మెరినా గతంలో తనకున్న కార్ల రిపేర్ హాబీని మళ్లీ మొదలుపెట్టారు. బయెనిక్ హ్యాండ్ కోసం ఏర్పాటు చేసిన సరంజామా అంతా ఆమె బ్యాగ్ లోనే ఉంది.

పని చేసేది ఇలా...

వేళ్ల చివర్లో ఉన్న సెన్సర్లను కంప్యూటర్‌కి అనుసంధానిస్తారు. ఇవి మెదడు అర్థం చేసుకునే భాషలోకి సంకేతాలను మారుస్తాయి. అల్మెరినా భుజంపైన నరాల్లో అమర్చిన చిన్నచిన్న ఎలక్ట్రోడుల ద్వారా సమాచారాన్ని చేరవేస్తాయి.

చర్మం లోపల సూక్ష్మస్థాయిలో ప్రవేశపెట్టే విధంగా వీటిని తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ వైద్య బృందాలు స్పర్శ ఉన్న కృత్రిమ కాళ్లను తయారు చేసే అంశంపై కూడా దృష్టిసారిస్తున్నాయి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)