వీడియో: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఓడ్కా బాటిల్‌‌ చోరీ

  • 6 జనవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionసీసీటీవీ దృశ్యం: ఓడ్కా మ్యూజియంలో చోరీ ఇలా జరిగింది

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఓడ్కా బాటిల్ చోరీకి గురైందని డెన్మార్క్ పోలీసులు వెల్లడించారు. దాని విలువ దాదాపు రూ. 8.25 కోట్లకు పైనే ఉంటుందన్నారు. దుండగులు ఖాళీ సీసాను ఓ నిర్మాణ స్థలంలో వదిలేసి వెళ్లారని తెలిపారు.

బంగారం, వెండితో ఈ ఓడ్కా బాటిల్‌ను తయారు చేశారు. దాని బిరడా(మూత)లో వజ్రాలు పొదిగి ఉన్నాయి.

భిన్న రకాల ఓడ్కాలను ప్రదర్శనకు పెట్టిన కోపెన్‌హాగన్‌లోని 'కేఫ్ 33' బార్‌లోనే ఈ బాటిల్‌ను కూడా ఉంచారు.

మంగళవారం ఆ బాటిల్ చోరీకి గురైందని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మరుసటి రోజు నిర్వాహకులు గుర్తించారు.

అయితే.. సీసాను పగలగొట్టకుండా నగరంలోని ఓ నిర్మాణ స్థలంలో పడేసి వెళ్లిపోయారు.

"ఓడ్కా ఏమైందో తెలియదు. కానీ.. ఖాళీ బాటిల్ మాత్రం దొరికింది" అని పోలీసులు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

Image copyright Dartz Motor Company
చిత్రం శీర్షిక ఈ వొడ్కా బాటిల్ బిరడాలో(మూత) వజ్రాలను పొదిగారు.

ఇప్పుడు ఖాళీ బాటిల్ కూడా అంతే విలువ ఉంటుందని కేఫ్ యజమాని చెబుతున్నారు. ఓడ్కాను నింపి దాన్ని మళ్లీ ప్రదర్శనకు పెడతామన్నారు.

ఈ బాటిల్‌ను డాట్స్ మోటార్ కంపెనీ నుంచి అరువుకు తీసుకున్నట్టు తెలిపారు.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)