వీడియో: ఇడ్లిబ్‌‌ను హస్తగతం చేసుకునేందుకు సిరియా ప్రభుత్వం చేస్తున్న దాడుల్లో బలవుతున్న సామాన్యులు

వీడియో: ఇడ్లిబ్‌‌ను హస్తగతం చేసుకునేందుకు సిరియా ప్రభుత్వం చేస్తున్న దాడుల్లో బలవుతున్న సామాన్యులు

సిరియాలోని ఇడ్లిబ్ పట్టణంలో మారణహోమం కొనసాగుతోంది.

సోమవారం జరిగిన మరో బాంబు పేలుడులో 23 మంది చనిపోయారు. రెండు వారాలుగా దక్షిణ ఇడ్లిబ్‌లో బాంబుల మోత వినిపిస్తూనే ఉంది.

సిరియా ప్రభుత్వ దళాలు విమానాలతో బాంబుల దాడి చేస్తూనే ఉన్నాయి.

సిరియా యుద్ధ విమానాలు పక్షం రోజులుగా దాడులు చేస్తూ దాదాపు 250 బాంబులతో ఇడ్లిబ్‌ను దద్దరిల్లేలా చేశాయి.

దాదాపు ఎనభై మంది ప్రజలు చనిపోయారు. మృతులు, గాయపడిన వారిలో పిల్లలు అధిక సంఖ్యలో ఉండడం మరీ విషాదం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)