సమాన వేతనంపై గళం విప్పిన హాలీవుడ్

సమాన వేతనంపై గళం విప్పిన హాలీవుడ్

సినీ పరిశ్రమ, మీడియాలలోనే కాక అన్ని రంగాలలోను మగవారితో సమానంగా మహిళలకు వేతనం ఇవ్వాలని గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ లో హాలీవుడ్ అగ్రనటులు డిమాండ్ చేశారు.

ఈ విషయంలో మహిళలు-పురుషులు అన్న భేదం లేకుండా నటీనటులు అందరు ఒకే తాటి పై నిలిచారు. బీబీసీతో ప్రత్యేకంగా సల్మా హయేక్, ఆష్లీ జడ్, మ్యాట్ స్మిత్, ఎవాన్ మెక్ గ్రెగర్, విలియం మేసి లాంటి ప్రఖ్యాత నటీనటులు ఈ విషయంలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.