జోల పాటలు, లాలి పాటలతో పిల్లలకే కాదు.. తల్లికి కూడా లాభమేనంట!

తల్లీ కూతురు

ఫొటో సోర్స్, iStock

ప్రసవం తర్వాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు.

సాధారణంగా ప్రసవం తర్వాత చాలామంది మహిళలు ఒకరకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు. ఆందోళన పడుతుంటారు.

అయితే... పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది.

అందులోనూ ఒంటరిగా కాకుండా.. గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపే మహిళలల్లో మరీ తొందరగా మార్పు వస్తుందని పరిశోధకులు గుర్తించారు.

ప్రతి ఎనిమిది మంది బాలింతల్లో ఒకరు కుంగుబాటుకు గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది.

గతంలో వయసు పైబడిన వారు పాటలు పాడుతూ డెమెన్షియా వంటి మానసిక రుగ్మతుల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించాయి.

బాలింతలకూ పాటలు మందుగా పనిచేస్తాయని చెప్పిన తొలి అధ్యయనం ఇదే.

ఫొటో సోర్స్, Getty Images

ప్రసవానంతర కుంగుబాటుతో బాధపడుతున్న 134 మంది మహిళలపై అధ్యయనం చేశారు.

వారిని మూడు గ్రూపులుగా విభజించారు.

  • ఒక బృందం వారితో గుంపుగా కలిసి పాటలు పాడించారు.
  • రెండో గ్రూపులోని వారితో ఆటలు ఆడించారు.
  • మూడో బృందం సభ్యులు సాధారణంగా కుటుంబ సభ్యుల సాయం తీసుకుంటూ.. మందులు వాడారు.

ఫొటో సోర్స్, Getty Images

మూడు బృందాల్లోని మహిళలు కోలుకునేందుకు 10 వారాలు పట్టింది.

వారిలో మొదటి గ్రూపులోని మహిళల్లో ఇతరుల కంటే చాలా తొందరగా కుంగుబాటు లక్షణాలు దూరమయ్యాయి.

బృందంలో కాకున్నా.. తన బిడ్డ కోసం జోల పాటలు పాడినా తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు తెలిపారు.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)