బీబీసీ ప్రత్యేకం: ఎనిమిదేళ్ళ సిరియా యుద్ధం.. ఎడతెగని విషాదం
ఎనిమిదేళ్ల సిరియా యుద్ధం... ఎడతెగని విషాధం
సిరియాలో రాజధాని డమాస్కస్ శివార్లలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలలో గత పది రోజుల్లో కనీసం 85 మంది చనిపోయారు.
సిరియా దిగ్బంధంలో ఉన్న తూర్పు ఘూటాలో ప్రభుత్వ దళాలు దాడుల తీవ్రతను పెంచాయి. ఈ పరిస్థితిని ఐక్యరాజ్య సమితి మానవీయ సంక్షోభంగా అభివర్ణించింది. ఈ ప్రాంతమంతా గత నాలుగున్నరేళ్ళుగా నిర్బంధంలో ఉంది. ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మీ మనసులను కలచివేయవచ్చు.
తూర్పు ఘూటాపై రోజూ బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కూలిన భవంతుల మధ్య చిక్కుకున్న చిన్నారులు భయంతో భోరుమని ఏడుస్తున్నారు. ఎక్కడికెళ్లాలో ఎక్కడ దాక్కోవాలో పాపం వారికేం తెలుసు.
హమైరా పరిసర ప్రాంతాల్లో వైట్ హెల్మెట్స్ దళాలు ఈ దృశ్యాలను చిత్రీకరించాయి.
బాధితులను కాపాడేందుకు.. ఏది దొరికితే దానితోనే తవ్వుతున్నారు. ఎక్కువ శాతం వట్టి చేతులతోనే పని చేస్తున్నారు. తిరుగుబాటుదారుల పట్టున్న డమాస్కస్ పై కొన్ని వారాలుగా సిరియా, రష్యా యుద్ధ విమానాలు చేసిన దాడులు చేసిన జాడలు ఈ వీధుల్లో కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ దళాలే కాదు, ఈ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న రెబెల్స్, వారికి మద్ధతిస్తున్న అల్ ఖైదా గ్రూపులు ప్రభుత్వ దళాలపై ఎదురుదాడి చేస్తున్నాయి. డమాస్కస్ లోని ప్రాంతాల నుంచి నిన్న పన్నెండు రాకెట్లతో దాడి చేశారు.
ఎనిమిదో ఏడులోకి అడుగుపెడుతున్న యుద్ధ విధ్వంస నాదమిది.
తూర్పు ఘూటాలోని ఈ చిన్నారులకు ఇంకో జీవితమే లేదు. విమాన దాడుల్లో ప్రాణాలతో మాత్రమే బయటపడ్డారు. ఉబికి వస్తున్న ఈ రక్తాన్ని తుడవడం మాత్రమే వాళ్ళు చేయగలరు. వారి బాధను, భయాన్ని మాత్రం తుడవలేరు.
ఏళ్ళకేళ్ళుగా శిక్షననుభవిస్తున్న పెద్ద వాళ్ళు కూడా.. ఈ విషాదాన్ని మోస్తున్నారు.
సిరియా చరిత్రంతా ఈ రాళ్ల మధ్యే లిఖించి ఉంది. మూడేళ్ల సమీర్ ను అతని బాబాయ్ నిన్ననే ఖననం చేశారు. సమీర్ తండ్రి తీవ్రంగా గాయపడ్డారు.
సిరియాలో యుద్ధం ముగిసిందని చాలా మంది అంటున్నారు. కానీ అది నిజం కాదు. యుద్ధం కొనసాగుతోంది.
మా ఇతర కథనాలు:
- సుప్రీంకోర్టు ‘సంక్షోభం’: న్యాయమూర్తుల లేఖలో ఏముందంటే..
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ‘తిరుగుబాటు’ చేసిన ఆ నలుగురు..
- కోడిపందేలు: కోడి ఎప్పుడు, ఎక్కడ పుట్టింది?
- కాలు లేకపోయినా క్రికెట్లో సూపర్‌స్టార్
- కశ్మీర్ విలీనానికి 70 ఏళ్లు
- చిన్నారి పెళ్లికూతురు.. ఇప్పుడు రెజ్లింగ్ స్టార్!
- శిథిల నగరం కింద శవాల కోసం వెదుకులాట
- #కోడిపందేలు: కోడి నెమలి ఎలా అయ్యింది?
- చెల్లెలి కోసం సోదరుడు 'విటుడి'గా మారి..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)