మొదటిసారి: సౌదీ మహిళలకు ఫుట్‌బాల్ చూసే అవకాశం

  • 13 జనవరి 2018
జెడ్డాలో ఫుట్ ‌బాల్ మ్యాచ్‌ని తిలకిస్తున్న ముస్లిం మహిళలు Image copyright AFP
చిత్రం శీర్షిక జెడ్డాలో ఫుట్ ‌బాల్ మ్యాచ్‌ని తిలకిస్తున్న ముస్లిం మహిళలు

సౌదీ అరేబియాలో మొదటిసారి మహిళలకు ఫుట్‌బాల్ ఆటను స్టేడియానికి వెళ్లి చూసే అవకాశం కల్పించారు.

ఈ ముస్లిం దేశం ఇటీవల మొదలుపెట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టింది.

దీంతో శుక్రవారం జెడ్డాలో మహిళలు పెద్దఎత్తున స్టేడియాలకు వెళ్లి ఫుట్‌బాల్ మ్యాచులు తిలకించారు.

ఇక్కడ గత కొంతకాలంగా పలు సంస్కరణలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు మహిళల కోసం ప్రత్యేకంగా కారు షోరూం కూడా మొదలైంది. ఈ మహిళా కార్ల షోరూంకీ మహిళలు పోటెత్తారు.

ఇక్కడి ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులో మహిళలు వాహనాలు నడిపేందుకు అనుమతించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గత ఏడాది రియాద్‌లో లెబనీస్ సింగర్ హిబా తవాజీ ప్రదర్శన

మహిళలు ఫుట్‌బాల్ మ్యాచ్‌ చూడటానికి అనుమతించాక.. స్టేడియాల్లోకి మహిళలను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం అని అర్థం వచ్చేలా ఓ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో పాపులర్ అయింది.

లమ్యా ఖలేడ్ నాసర్ అనే మహిళ మాట్లాడుతూ.. నేరుగా ఫుట్‌బాల్ ఆట చూడటాన్ని చాలా గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.

ఈ భారీ సంస్కరణల్లో భాగమైందనందుకు ఆనందంగా ఉందనీ వివరించారు.

సౌదీ మహిళలు పురుషుల అనుమతి లేకుండా.. చేయలేని పనులు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి

  • పాస్‌పోర్టులకు దరఖాస్తు చేయడం
  • విదేశీ ప్రయాణం
  • పెళ్లి చేసుకోవడం
  • బ్యాంకు ఖాతా తెరవడం
  • వ్యాపారం మొదలుపెట్టడం
  • జైలు నుంచి విడుదల కావడం

ఇక్కడ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నేత‌ృత్వంలో పలు సంస్కరణలు మొదలయ్యాయి. ఇటీవల సినిమాలు చూడటంపై నిషేధాన్ని కూడా ఎత్తేశారు.

అయితే ఈ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నవారూ కొందరున్నారు.

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.